8 గంటల నుంచి ఎంపీపీ,జెడ్పీల కౌంటింగ్

Date:03/06/2019

హైద్రాబాద్  ముచ్చట్లు:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్నది. మధ్యాహ్నం నుంచి ఫలితాల ట్రెండ్ తెలిసిపోనున్నది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపును పూర్తిచేసేలా ఈసీ చర్యలు చేపట్టింది. మొత్తం 2,426 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,930 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనున్నది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 123 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో 978 కౌంటింగ్ హాళ్లు ఉంటాయి.మొదటిదశలో పోలింగ్ కేంద్రాలవారీగా బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కించనున్నారు. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలవారీగా విడదీసి ఒక్కోబండిల్‌లో 25 బ్యాలెట్ పత్రాలు చుట్టనున్నారు. రెండోదశలో ఎంపీటీసీ ఎన్నికకు కౌంటింగ్ మొదలుపెడుతారు. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్ల, రెండురౌండ్లు ఏర్పాటుచేశారు. ప్రతి ఎంపీటీసీ అభ్యర్థి ఇద్దరు ఏజెంట్లను నియమించుకోవాలని ఇప్పటికే అధికారులు అభ్యర్థులకు సూచించారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను తెరిచి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూడనున్నారు.తొలుత ఎంపీటీసీ స్థానాల్లో, తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్‌లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా.. ఒక్కోస్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటుచేశారు. 11,882 మంది సూపర్‌వైజర్లు, 23,647 మంది అసిస్టెంట్లతో కలుపుకొని మొ త్తం 35,529 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. లెక్కింపు సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

గ్రూప్ 2 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

Tags:Green signal for group 2 posts…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *