Natyam ad

మునుగోడు ఓట్ల లెక్కింపు..అంతా సిద్దం

మునుగోడు ముచ్చట్లు:


ఆదివారం నాడు మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. అధికారులు కౌటింగ్ కు సర్వం  సిద్ధం చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల బాభావి లోని  వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 రౌండ్స్ లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు.  ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్ లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.  మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్ లాల్లో లెక్కిస్తారు.  మొదట పోలింగ్ ఏజెంట్ లు, అభ్యర్థుల సమక్షంలో  స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.  మునుగోడు లో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. .పోస్టల్ బ్యాలెట్  ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంలల్లో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్ ,అసిస్టెంట్ సూపర్వైజర్ ,మైక్రో అబ్జర్ వర్  లను  నియమించారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం  9 గంటలకు విడుదల అవుతుంది…చివరి రౌండ్ ఫలితం వంటి గంటకు విడుదల అవుతాయి. 15 రౌండ్స్ లాల్లో 298 పోలింగ్ కేంద్రాల్లో  పోలైన అన్ని ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల  ఓట్లు   లెక్కిస్తారు. మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కిస్తారు.. ఆ తర్వాత  నారాయణ పురం, మునుగోడు, చండూర్,  మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కిస్తాఆరు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

 

Tags: Counting of votes earlier..everything is ready

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.