దేశం కానీ దేశంలో చివరకు
కాకినాడ ముచ్చట్లు:
దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడ్డ ఓ మహిళ తనువు చాలించింది. ఎన్నో ఆశలతో ఎడారి దేశానికి వెళ్లిన ఆమె ఇంట్లో పని ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తన పరిస్థితిని వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపి ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ మహిళ.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన కోడా వెంకటలక్ష్మి ఉపాధికోసం మస్కట్కి వెళ్లారు. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, జిలాని, రవి అనే ఏజెంట్లు ఎడారి దేశానికి పంపారు. అక్కడికి వెళ్లాక వెంకటలక్ష్మికి అస్సలు విషయం తెలిసింది. ఉద్యోగం ఏమోగానీ, ఓ షేక్ దగ్గర పని మనిషిగా చేరింది. 24 గంటలు వెట్టిచాకిరి చేస్తూ ఒత్తిడికి గురైంది. కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంకటలక్ష్మి భర్త నాగరాజు ఏజెంట్లను సంప్రదించాడు. ఇంటికి రప్పించాలంటే లక్షా 50వేలు ఖర్చవుతుందని ఏజెంట్లు తెగేసి చెప్పారు. ఐతే అంతా ఇచ్చుకోలేని నాగరాజు 50 వేలు ఇస్తానని చెప్పినా..పట్టించుకోలేదని వాపోయాడు.ఇక దిక్కుతోచని స్థితిలో వెంకట్లక్ష్మి, కుటుంబసభ్యులతో వీడియోకాల్ మాట్లాడుతూ లైవ్లోనే ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఇద్దరు ఏజెంట్లే కారణమని ఆమె ఆరోపించింది. ఆ దృశ్యాలు చూస్తూ కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు.
Tags: country but finally in the country

