Country leaders who joined the YSRCP

వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన దేశం నాయకులు

Date:31/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

రామకుప్పం మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు సుమారు 200 మంది వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆదివారం పట్టణంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామకుప్పం అయ్యప్పగారిపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ మండల పార్టీ కన్వీనర్‌ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ అభ్యర్థి సుబ్రమణ్యం, సర్పంచ్‌ అభ్యర్థి బివి.మురళి, సంతోష్‌ పార్టీలో చేరారు. వీరికి ఎంపీ రెడ్డెప్ప కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌ గోవిందస్వామి, చంద్ర, ఆనంద్‌, రవి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏడాది పాలనలో కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనిని చూసి గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు ప్రారంభించారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గంగాధరం, అప్పి, నారాయణస్వామి, చంద్రారెడ్డి, కె.బాబురెడ్డి, శంకర, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

  Country leaders who joined the YSRCP

కడప నగరంలో దారుణం 

Tags: Country leaders who joined the YSRCP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *