ఆర్మీకి అండ‌గా దేశం.. రాజ్య‌స‌భలో విప‌క్షాల‌ సంఘీభావం

Date:17/09/2020

న్యూ ఢిల్లీ ముచ్చట్లు

చైనాతో స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న విష‌యంలో ఇవాళ రాజ్య‌స‌భ‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. వాస్తవాధీన రేఖ వ‌ద్ద చైనా ద‌ళాలు ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ అంశంపై విప‌క్ష స‌భ్యులు కూడా త‌మ గ‌ళం వినిపించారు.  ఆర్మీ వెంటే దేశం ఉంటుంద‌ని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శ‌ర్మ అన్నారు. ఈ విష‌యంలో అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఉన్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే, అప్పుడు ఏం చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సైనిక ద‌ళాల‌కు అండ‌గా ఉంటామ‌ని కూడా ఇత‌ర రాజ్య‌స‌భ ఎంపీలు తెలిపారు. ఐక్య‌త‌, సార్వ‌భౌమ‌త్వం విష‌యంలో దేశం ఒక‌టిగా ఉంటుంద‌ని రాజ్య‌స‌భ విప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ తెలిపారు. సియాచిన్ సైనిక పోస్టుల‌ను గ‌తంలో చాలా సార్లు తాను విజిట్ చేసిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. చైనా ద‌ళాలు త‌మ స్వంత‌ స్థానానికి వెళ్లిపోవాల‌ని ఆయ‌న కోరారు. ఈ అంశంలో రాజ్య‌స‌భ స‌భ్యులంద‌రూ సంఘీభావం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

 

వివిధ పార్టీ ఎంపీలు సంఘీభావం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంసించారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాల‌ని భావించ‌డం లేదు, ఎందుకంటే మ‌నం అంతా ఒక్క‌టే అన్న సందేశాన్ని వినిపంచార‌న్నారు.  మాజీ ర‌క్ష‌ణ మంత్రి ఏకే ఆంటోనీ చేసిన వ్యాఖ్య‌ల‌కు రాజ్‌నాథ్ స‌మాధానం ఇస్తూ.. భార‌త ద‌ళాల‌ను పెట్రోలింగ్ చేయ‌కుండా చైనా అడ్డుకుంటుంద‌న్నారు. అయితే తాము పెట్రోలింగ్ ప‌ద్ధ‌తుల‌ను మార్చ‌డం లేద‌ని, మ‌న భూభాగంలో పెట్రోలింగ్ నిర్వ‌హించ‌కుండా మ‌న సైనికుల‌ను అడ్డుకునే శ‌క్తి ఏదీ లేద‌న్నారు. కానీ చ‌ర్చ‌లు మాత్రం కొన‌సాగుతూనే ఉంటాయ‌న్నారు.  ఎల‌క్ట్రానిక్ మీడియా వ‌ల్ల స‌రిహ‌ద్దుల్లో యుద్ధం లాంటి వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ ర‌వి ప్ర‌కాశ్ వ‌ర్మ ఆరోపించారు. దేశం యావ‌త్ సైనిక ద‌ళాల వెంట ఉన్న‌ద‌ని, అయితే సార్వ‌భౌమ‌త్వం కాపాడుకుంటామ‌ని ర‌క్ష‌ణ మంత్రి చెప్ప‌డంలో అర్థం ఏముంద‌ని ఏకే ఆంటోని ప్ర‌శ్నించారు.

 

 ఏపీలో ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌పండి : ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి

Tags:Country under the Army .. Opposition solidarity in the Rajya Sabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *