కంత్రీ భార్య భర్తలు…

-బీటెక్ చదవి… ప్రేమ పెళ్లి చేసుకొని…చివరకు జైలు పాలు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

చదువుకునే సమయంలోనే ప్రేమలో పడి.. ఆ మోజులో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటోంది నేటి యువత! ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న అందరూ ఇబ్బందుల్లో పడుతున్నారని చెప్పట్లేదు.. కానీ, పరిణతి లేని ఆలోచనలు, గొప్పగా లేని చదువు, చేతిలో లేని ఉద్యోగం కారణంగా ఎన్నో ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. మరికొందరైతే చిన్న వయసులో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతులను సుఖంగా ఉంచడం కోసం వక్రమార్గాలు పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కొన్నాళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.అది శ్రీకాకుళం జిల్లా, పలాస పట్టణంలోని గోపివల్లభపురం ఏరియా. ఈ కాలనీలోని ఓ ఇంట్లో కొత్తగా పెళ్లయిన జంట నివాసం ఉంటున్నారు. అమ్మాయి పేరు శిరీష, అబ్బాయి పేరు సతీష్. ఇద్దరూ బీటెక్‌ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం వారిని ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక జాబ్ వస్తుందని సతీష్ సర్దిచెప్పాడు.అయితే, పెళ్లయి నెలలు గడిచినా సతీష్‌కు ఉద్యోగం రాకపోవడంతో భర్తపై శిరీష చిరాకుపడుతుండేది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య.. కొన్నాళ్లకే గొడవలు మొదలయ్యాయి.

 

 

 

 

ఈ సమయంలోనే శిరీషకు ఓ ఐడియా వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్న సతీష్, శిరీషల స్నేహితుడు వినయ్ గుర్తొచ్చాడు. వినయ్ హైదరాబాద్‌లో మంచి జాబ్‌లో సెటిల్ అయ్యాడు. సతీష్, శిరీషల పెళ్లి కూడా చేసింది వినయే! దీంతో వినయ్‌కి ఫోన్ చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తాడేమో ఫోన్ చేయాలని భర్త సతీష్‌కు శిరీష చెప్పింది.సతీష్ ఫోన్ చేసి తన పరిస్థితి వివరించగా.. వినయ్ కూడా పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ హైదరాబాద్ వచ్చి తన ఫ్లాట్‌లో ఉంటే.. ఉద్యోగం వెతకడం సులువవుతుందని పేర్కొన్నాడు. మరుసటి రోజే శిరీష, సతీష్ దంపతులు హైదరాబాద్ వచ్చి.. వినయ్ ఫ్లాట్‌లో దిగారు. వినయ్ కూడా తానే పెళ్లి చేసిన ఫ్రెండ్స్ కాబట్టి.. ఇంటిని వారికి అప్పగించాడు. తానింకా బ్యాచ్‌లర్, అందులోనూ మార్కెటింగ్ జాబ్ కావడంతో ఫ్రెండ్స్ దగ్గర ఉంటానని భార్యాభర్తలకు నచ్చజెప్పారు. అలాగే సతీష్‌కు ఖర్చుల కోసం డబ్బు కూడా ఇచ్చి, ఫ్లాట్ అప్పగించి వెళ్లిపోయాడు.తర్వాత, ఆ డబ్బుతో కొన్నాళ్ల పాటు భార్యాభర్తలు ఎంజాయ్ చేశారు. కొద్దిరోజులకు, సతీష్ మళ్లీ ఉద్యోగాల వేట ప్రారంభించాడు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకకపోవడంతో డీలా పడ్డాడు.

 

 

 

 

ఇంతలో సతీష్‌కు ఓ నీచమైన ఆలోచన వచ్చింది. పరువు ప్రతిష్టలు బాగా డబ్బు వ్యక్తులను తన భార్య సాయంతో ట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే భారీగా డబ్బు సంపాదించవచ్చని పథకం పన్నాడు. అనుకున్నదే తడవుగా.. హైదరాబాద్‌లో ప్రముఖుల ఫోన్ నంబర్లు సేకరించాడుఇక, నేరుగా ఇంటికొచ్చిన సతీష్.. తన భార్య శిరీషకు తన ప్లాన్ గురించి వివరించాడు. నగరంలోని బాగా డబ్బున్న వాళ్లను ట్రాప్ చేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపాడు. మొదట్లో కాస్త తటపటాయించిన శిరీష.. డబ్బు మోజులో భర్తకు ఓకే చెప్పేసింది. ఇక, వరుసగా డబ్బున్న వ్యక్తులకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు. చాలా మందికి చేసిన తర్వాత నగరంలోని రియల్‌ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ బుక్కయ్యాడు.రియల్టర్ గంగాధర్‌ను మెల్లగా మాటలతో మాయ చేసిన శిరీష.. అతడితో అంతకు ముందు పరిచయం ఉన్నట్లుగా మాట్లాడింది. తర్వాత, ఫోన్‌లోనే గంగాధర్‌కు ముద్దు ఇచ్చి ముగ్గులోకి దింపింది. తర్వాత, రోజూ గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఒకరి ఫొటోలు, మరొకరు వాట్సాప్‌లో షేర్ చేసుకున్నారు. శిరీష ఫోటోలను చూసిన గంగాధర్ ఫిదా అయిపోయాడు. ఒక రోజు తన ఇంటికి రావాలని గంగాధర్‌ను శిరీష ఆహ్వానించింది. దీంతో ఎంతో ఉత్సాహంగా గంగాధర్ ఆమె ఇంటికి వెళ్లాడు.

 

 

 

 

ముందుగా పక్కాగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే.. బెడ్‌రూంలో శిరీష‌తో గంగాధర్ ఏకాంతంగా ఉండగా, ఒక్కసారిగా గదిలోకి సతీష్ ఎంట్రీ ఇచ్చాడు. తన భార్యను, గంగాధర్‌ను దుర్భాషలాడాడు. ఈ విషయాన్ని నీ భార్యకు చెప్పి, మీడియాకు లాగుతానని గంగాధర్‌ను సతీష్ బెదిరించాడు. దీంతో తన ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరాలు, వాచ్, జేబులో ఉన్న డబ్బు అంతా సతీష్‌కి ఇచ్చేసిన గంగాధర్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యాలని వేడుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి జంప్ అయ్యాడు. అయితే, భార్యను అడ్డుపెట్టుకుని గంగాధర్‌ను నిలువు దోపిడీ చేసిన సతీష్.. అతడికి తెలియకుండా మరో పని చేశాడు. శిరీష‌తో గంగాధర్ గదిలో ఉన్న వ్యవహారాన్ని మొత్తం వీడియో తీశాడు.గంగాధర్ ఇచ్చిన బంగారంతో 2 నెలల పాటు శిరీష, సతీష్ దంపతులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. తర్వాత, ఆ డబ్బు అయిపోవడంతో ఆ వీడియోకు పనిపెట్టారు. శిరీషతో ఏకంగా ఉన్న వీడియోను గంగాధర్‌కు పంపించాడు సతీష్. తనకు వెంటనే రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే ఈ వీడియోను బజార్లో పెడతానని హెచ్చరించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గంగాధర్.. అంత డబ్బు లేదంటూ లక్ష రూపాయిలు ఇచ్చాడు. ఈ వీడియో డిలీట్ చేయాలని కోరాడు. అయితే, తనకు ఇంకొన్ని కోరికలు తీరిస్తే వీడియో నీకే ఇచ్చేస్తానంటూ గంగాధర్‌ను అక్కడి నుంచి పంపించి వేశాడు.

 

 

 

 

 

కొన్ని రోజుల తర్వాత గంగాధర్‌కు సతీష్ మళ్లీ ఫోన్ చేసి.. తన బిజినెస్‌లో తమను పార్ట్‌నర్లుగా చేసుకోవాలని షరతు పెట్టాడు. అప్పటికే వీరికి భారీగా డబ్బు, బంగారం ఇచ్చిన గంగాధర్.. సతీష్ ప్రతిపాదనపై రగిలిపోయాడు. వెంటనే సతీష్ ఇంటి వద్దకు వచ్చాడు. ఇది న్యాయం కాదని, తనను వదిలెయ్యాలని సతీష్, శిరీషను గంగాధర్ వేడుకున్నాడు. సతీష్ ససేమిరా అనడంతో గంగాధర్ కోపంతో అతడిపై చేయిచేసుకున్నాడు.ఇద్దరి మధ్య కోట్లాట తారాస్థాయికి చేరడంతో శిరీష.. గంగాధర్‌ను నిలువరించేందుకు ప్రయత్నించింది. దీంతో మరింత రగిలిపోయిన గంగాధర్.. ఈ మొత్తం పాపానికి కారణం నువ్వేనంటూ శిరీషపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే, సతీష్ తన చేతిలో ఉన్న కర్చీఫ్‌ను గంగాధర్ మెడకు బిగించి హత్య చేశాడు. తర్వాత, ఈ శవాన్ని ఇంటి పక్కన కొత్తగా కడుతున్న ఓ బిల్టింగ్ వద్ద పాతిపెట్టేశారు.గంగాధర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. హైదరాబాద్, గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైంది. రియల్టర్ గంగాధర్ కేసును త్వరగా ఛేదించాలంటూ ఎస్సై వీర ప్రసాద్‌కి ఒత్తిళ్లు వచ్చాయి.

 

 

 

 

దీంతో, గంగాధర్ మొబైల్ కాల్ లిస్ట్ సేకరించారు. ఇందులో ఒక నంబర్‌ నుంచి గంగాధర్‌కు ఎక్కువ సార్లు ఫోన్ రావడం గుర్తించారు. ఆ నంబర్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవకపోవడంతో అనుమానం వచ్చి ఆ నంబర్ ఎవరి పేరుతో ఉందో కనిపెట్టారు.ఈ ఫోన్ నంబర్.. శిరీష, సతీష్‌ల స్నేహితుడు వినయ్‌ది అని తేలింది. వెంటనే వినయ్‌ని అదుపులోకి తీసుకున్న ఎస్సై వీరప్రసాద్ తనదైన శైలిలో విచారించారు. దీంతో ఆ దెబ్బలకు తాళలేక.. ఆ నంబర్‌ నాదే కానీ, దీన్ని తన ఫ్రెండ్ వాడుతున్నాడని వినయ్ చెప్పాడు. తన స్నేహితుడు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అమ్మాయి వారి తరఫు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పడంతో.. తన నంబర్ ఇచ్చినట్లు చెప్పాడు.దీంతో సతీష్ కోసం ఎస్సై ఫ్లాట్‌కి వెళ్లడంతో.. ఆ సమయంలోనే అక్కడి నుంచి సతీష్, శిరీష కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని గమనించారు. వెంటనే ఎస్సై అలర్ట్ అయ్యి.. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో సతీష్‌ను తనదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. గంగాధర్‌ను తామే ట్రాప్ చేసి, బ్లాక్మెయిల్ చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ కంత్రీ భార్యాభర్తలు సతీష్, శిరీష జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Country wife husbands …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *