Natyam ad

ప్రేమజంట ఆత్మహత్య

యాదాద్రి ముచ్చట్లు:


యాదాద్రి భువనగిరి జిల్లా  యాదగిరిగుట్ట మండలం బాహుపేట రైల్వే గేట్ సమీపంలో ట్రైన్ కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్ కు చెందిన ఉడుతల గణేష్ (25), నలంద(23)గా గుర్తించారు.  మృతురాలు నలంద కి గత మూడు సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. మృతురాలు భర్త యాదగిరిగుట్ట పైన ఉద్యోగం చేస్తుండగా మంగళవారం రాత్రి డ్యూటీ దిగి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బహుపేట రైల్వే పట్టాల వద్ద మృతదేహాలు పడి ఉండడంతో గమనించిన రైల్వే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి రెండు గంటల 30 నిమిషాలకు ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు  రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే  పోలీసులు ఈ మృతదేహాలను గుర్తించి ఉదయం స్థానిక పోలీసుల సమాచారం అందజేశారు.

 

Tags: Couple suicide

Post Midle
Post Midle