మునిసిపల్ ఎన్నికలకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Date:22/10/2019

హైదరాబాద్  ముచ్చట్లు:

హైకోర్టులో మున్సిపల్ ఎన్నికల విషయంలో కీలక తీర్పు వెలువడింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను తమ అభ్యంతరాలను పరిష్కరించిన తరువాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అనేక పిటీషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటి మీద సుదీర్ఘంగా చర్చలు..వాదనలు సాగాయి. అయితే, వాటన్నింటినీ హైకోర్టు కొట్టివేస్తూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. కాగా తెలంగాణలోని మొత్తం 128 మున్సిపాల్టీలు..13 కార్పోరేషన్లు ఉన్నాయి.అందులో 78 మున్సిపాల్టీలకు సంబంధించి గతంలో కోర్టు స్టే ఇచ్చంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో గతంలో సింగ్ బెంచ్ ఇచ్చిన  మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణ కోసం స్టే వెకేట్ చేయించుకోవాలని సూచించింది. మిగిలిన 50 మున్సిపాల్టీలకు మాత్రం హైకోర్టు అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వీటి పైన దాదాపు ఆరు నెలలకు పైగా విచారణ సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టేసింది.

 

 

 

గతంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే, సుదీర్ఘంగా కోర్టుల్లో ఉన్న కేసులు, వాదనల కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యపడలేదు. అయితే, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తాము ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు కోర్టు తీర్పు 50 మున్సిపాల్టీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 78 మున్సిపాల్టీల విషయంలో మాత్రం స్టే తొలిగిస్తేనే ఎన్నికలు సాధ్యం అవుతుంది. దీంతో..ప్రభుత్వం ఆ దిశగా న్యాయ పరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. స్టే తొలిగించిన తరువాత మొత్తంగా 128 మున్సిపాల్టీలకు కలిసి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు లైన్ క్లియరెన్స్ ఇచ్చినా! అన్ని మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగే విషయంపై సందిగ్దత నెలకొంది. స్టే పిటీషన్స్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

అమిత్ షాతో సీఎం జగన్ భేటీ

Tags: Court green signal for municipal elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *