బోడే ప్రసాద్ పై  కేసు నమోదు చేయాలని  కోర్టు ఆదేశం

Court orders to register case against Bode Prasad

Court orders to register case against Bode Prasad

Date:18/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు హైకోర్టు షాకిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. రోజా వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టగా.. రోజా తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అధికార పార్టీ నేతలు రోజా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరగా.. బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. జులై 9న పెనమలూరులో జరిగిన టీడీపీ సమావేశంలో బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోజాపై మండిపడ్డ ప్రసాద్.. కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మెల్యే ప్రసాద్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. దీనిపై పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని.. రోజా గత నెల హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయమని ఆదేశించింది.
Tags:Court orders to register case against Bode Prasad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *