గీతగోవిందంపై కోటి ఆశలు

Covet hopes on the song

Covet hopes on the song

Date:11/08/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
హీరోహీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన ‘గీతగోవిందం’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. అలాగే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ‘గీతగోవిందం’ విడుదలకు ముందే బ్రహ్మాండమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రత్యేకించి యూత్‌లో ఈ సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. దీనికి భారీ ఓపెనింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు పదిహేను కాలేజీ స్టూడెంట్లకు దాదాపుగా సెలవుదినం. దీంతో థియేటర్ల వద్ద సందడి ఉంటుంది. ఇంతకీ ఈ సినిమా టార్గెట్ ఎన్ని కోట్ల రూపాయలంటే.. 15 కోట్ల రూపాయల వరకూ అని సమాచారం. ఈ సినిమా మేకింగ్‌కు దాదాపు ఇంత ఖర్చు అయినట్టుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వసూళ్లను తిరిగి రాబట్టుకుంటే ‘గీతగోవిందం’ హిట్ అని చెప్పవచ్చని అంటున్నారు. థియేటరికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో ఈ డబ్బును రాబట్టు కోవాల్సి ఉంది ‘గీతగోవిందం’. ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను పరిశీలించి చూస్తే.. ఈ స్థాయి మొత్తాన్ని రాబట్టుకోవడం ఈ సినిమాకు ఏ మాత్రం కష్టం కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Tags:Covet hopes on the song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *