.కోవిడ్19 వ్యాక్సిన్ టీకా ప్రారంభించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి

Date:16/01/2021

ఆదోని ముచ్చట్లు:

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ టీకా శనివారం ప్రారంభం కావడంతో స్థానిక  ఏరియా హాస్పిటల్ లో ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కోవిద్ 19 వ్యాక్సిన్ టీకాను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ  ఒక సంకల్ప దీక్ష తో ఆయన గడ్డం కూడా చేసుకోకుండాగా ప్రజలకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే తను గడ్డం చేయించుకుంటానని  ఒక దీక్షధ్యక్షుడిగా ఆయన కఠోర దీక్ష చేపట్టారు దేశంలో కరోనా టీకా వ్యాక్సిన్  ఉచితంగా  అందిస్తున్నారని ఆయన తెలిపారు .దేశంలో ఉన్న పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు అన్నారు. ఇదే ఇతర  దేశాల్లో వ్యాక్సిన్ కొంత డబ్బులు తీసుకొని వ్యాక్సిన్ టీకాలు వేస్తున్నారు. మనకు అదే భారం మనమీద పడకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ  ఉచితంగా మన రాష్ట్రానికి వ్యాక్సిన్ అందజేయడం జరిగింది అని అన్నారు. టీకా విషయంలో ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలు ఎవరు కూడా నమ్మొద్దని టీకా వేసుకుంటే ఏదో రియాక్షన్స్ వస్తుందని రెండో రకం కరుణ వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి అపోహలు నమ్మవద్దని  ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సూచించారు. ఆదోని ఏరియా ఆసుపత్రిలో సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ టీకా వేయడం జరిగింది అన్నారు .ఈ కార్యక్రమంలో డీఎస్పీ వినోద్ కుమార్ వన్ టౌన్ సిఐ చంద్ర శేఖర్, టూ టౌన్ సిఐ శ్రీరాములు , ఎమ్మార్వో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఆర్ జి వి కృష్ణ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.దేవా ,మూర్తి, తిమ్మప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు యువజన సంఘ నాయకుడు చెంగారెడ్డి జన్మదిన వేడుకలు

Tags:.Covid 19 Vaccine Vaccination Launched by MLA Saiprasad Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *