ప్రాణాయామంతో కొరోనా నియంత్రించచ్చు సి.పి మహేష్ భాగవత్  కొరోనా సోకి కోల్కున్న పోలీసులను సత్కరించిన సి.పి

Date:18/07/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

విధులు నిర్వర్తిస్తూ కొరోనా సోకి గాంధీ హాస్పిటల్ లో చికిస్త పొంది తిరిగి విధుల్లో చేరిన  ముప్పై ఒకటి మందికి పోలీస్ సిబ్బందిని సత్కరీంచిన రాచకొండ సి.పి మహేష్ భాగ్వత్. రాచకొండ కమీష్నరేట్ పరిధిలో విధులలో చేరిన సిబ్బందిని సత్కరించి వారి అనుభావాలను సి.పి విన్నారు . కొరోనా సోకిన ప్రతీ సిబ్బందికి రాచకొండ కమీష్నర్ మహేష్ భాగ్వత్ స్వయంగా కాల్ చేసి తమ బాగోగులు తెలుసుకున్నారని తమకి ధర్యం చెప్పారని, వారి మాటలవల్లే మనస్థైర్యం వచ్చిందని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ భాగవత్  మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది తమ విధులు నిర్వహించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . రానున్న కాలంలో కొరోనా తో కలిసి జీవించడం నేర్చుకోవాలను , ప్రతీరోజు ఖచ్చితంగా ఉదయాన్నే ప్రాణాయామం చేయాలని తద్వారా స్వాస సంభందిత వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు.
బయటకి వెళ్ళె ప్రతీ వ్యక్తి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. లేకపోతే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

 

 కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలి కరోనా భీమా సౌకర్యం కల్పించాలి

Tags:CP can control corona with pranayama CP Bhagwat honors cops who lost corona infection CP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *