స్మశాన స్థలం కోసం సిపిఐ ధర్నా

కడప ముచ్చట్లు:


నగరంలోని అల్లూరి సీతారామరాజు నగర్, చెంచు కాలనీ, నంద్యాల నాగిరెడ్డి కాలనీ వాసులకు స్మశాన స్థల కేటాయింపు చేపట్టాలని సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ కోరారు. దీర్ఘకాలికంగా ఉన్న స్మశాన స్థల సమస్య పరిష్కారం కోసం  సోమవారం కడప తాహాసిల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా చేపట్టి, తాహాసిల్దార్ శివరామి రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడు తూ కడప  హోమియోపతి కాలేజీ పరిసర ప్రాంతాల ప్రజలు ఏళ్ల తరబడి స్మశాన వాటిక స్థలము లేక సమీపంలోని రైల్వే లైన్ కట్ట వెంబడి శవాలను పూడ్చు కుంటుండే వారన్నారు. కాలనీల చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అక్కడికి దారులు కూడా మూసివేసిన నేపథ్యంలో చనిపోయిన వారికి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియ లు చేపట్టడానికి తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారన్నారు.

 

 

ఈ మధ్యకాలంలో చనిపోయిన వారిని వ్యయ ప్రయాసలతో చెన్నూరు పెన్నా నది పరిసర ప్రాంతంలో అంత్యక్రియలు చేస్తున్నారన్నారు.అల్లూరి సీతారామరాజు నగర్, చెంచు కాలనీల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలములను స్మశానానికి కేటాయించాలని వారు కోరారు. పేదలు నివాసముంటున్న కమ్ము సాహెబ్ నగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీ లలో కాలువలు వెడల్పుతో పూర్తిగా ఇల్లులు పోకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు సావంత్ సుధాకర్, టక్కోలు మనోహర్ రెడ్డి, నాగరాజు, మునయ్య, ఆర్ బాబు, ఓబయ్య, బ్రహ్మం ,మల్లికార్జున, శంకర్ నాయక్, భాగ్యలక్ష్మి, ఓబులయ్య, పుష్పరాజు, సత్తార్, లక్ష్మీనారాయణ, దేవి, తిరుపతమ్మ, ఆదిలక్ష్మి , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: CPI dharna for graveyard

Leave A Reply

Your email address will not be published.