గోస్పాడు లో సీపీఐ మహ సభలు

జెండా ఆవిష్కరణ చేసిన బాబా ఫక్రుద్దీన్

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో సోమవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)గోస్పాడు మండల మహా సభలు గోస్పాడు పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీతో బయలుదేరారు .ఈ మహాసభకు గోస్పాడు మండల సీపీఐ కార్యదర్శి చెన్నయ్య అధ్యక్షతన వహించారు.గోస్పాడు మండల మహాసభ ప్రారంభానికి ముందు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ గోస్పాడు లో జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ  సభ్యులు కే.రామాంజనేయులు ,సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు ,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్,బి కె యమ్ యు . జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ  ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో ఎఐవైయప్. ఎఐ యస్ ప్ . జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగరాముడు, ధనుంజయుడు, ఆంద్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి శివయ్య, గాయకులు గోఖారీ, రమేష్ ఎఐ యస్ ప్ ,. జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్,బి కె యమ్ యు . గోస్పాడు మండల కార్యదర్శి హరి,మాజీ మండల కార్యదర్శి కుమార్ మరియు గోస్పాడు మండల సీపీఐ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: CPI General Assembly in Gospada

Post Midle
Natyam ad