సీపీఐ పోస్టర్ ఆవిష్కకరణ
విశాఖపట్నం ముచ్చట్లు:
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నినాదాలకే పరిమితమైందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి విమర్శించారు.ఈ నెల 26, 27, 28 తేదీల్లో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27 వ మహాసభలకు సంబందించిన పోస్టర్ ను విశాఖ సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు.మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆచరణలో సాధించినది శూన్యమని అన్నారు. మోడీ ప్రధాని కాగానే స్వచ్ఛభారత్ నినాదం ఇచ్చారని, ఎనిమిదేళ్లలో ఒక్క గ్రామం కానీ నగరం కానీ స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని అన్నారు. నల్ల ధనాన్ని వెతికి తీయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. అవినీతిని అంతం చేయాలంటూ స్వాతంత్ర దినోత్సవ రోజున ఎర్రకోట నుంచి మోడీ రొటీన్ ప్రసంగం చేశారని అన్నారు. గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ ఈదరగొట్టారని, గుజరాత్ లో పేదరికం, పౌష్టికాహార లోపం ఇప్పటికీ సమస్యగా ఉన్నాయని అన్నారు.ప్రచారాలు, నినాదాలతో కాలం గడుపుతున్న బిజెపి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం పై జాతీయ మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి మూడేళ్ల పాలనలో అప్పులు తెచ్చి నగదు బదిలీలు చేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి లేదని అన్నారు.

Tags: CPI poster launch
