సిపిఐ నిరసన
విశాఖపట్నం ముచ్చట్లు:
భూకబ్జాదారుల నుండి కళ్ళు గీత కార్మికులను కాపాడాలని సిపిఐ పార్టీ నిరసన వ్యక్తం చేసింది . విశాఖ నగరంలోని జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. విశాఖలోని పాత మధురవాడ సర్వే నెం 274/1 లో కళ్లు గీత కార్మిక కుటుంబాలుకు చెందిన భూమిని దొంగ రిజిస్ట్రేషన్ తో కొట్టేయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్న కబ్జా దారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాదారులకు మద్దతు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పైడ్రాజు, విమల తదితరులు పాల్గొన్నారు.
Tags: CPI protest

