పోలవరాన్ని పరిశీలించిన సిపిఐ బృందం
ఏలూరు ముచ్చట్లు:
సిపిఐ నేతల బృందం ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్ట్ లో పర్యటించింది. పోలవరం ప్రాజెక్ట్ లో స్పిల్ వే, కాఫర్ డ్యాం లను పరిశీలించింది.రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు త్రాగు నీరు, 960 మెగా వాట్ల జల విద్యుత్ ఈ ప్రాజెక్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయని,పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ 2021 జూన్ నాటికి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని వాగ్దానం చేశారు కానీ ఇప్పటివరకూ ప్రాజెక్ట్ లో మెయిన్ డ్యాం నిర్మాణం ప్రారంభం కాలేదని రామకృష్ణ అన్నారు.జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించిన కేంధ్ర ప్రభుత్వం .. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం వేగంగా నిధులు ఇవ్వాలని,గోదావరి వరదల కారణంగా నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా వారిని పట్టించుకోవడం లేదని,తెలంగాణా ప్రభుత్వం వరద బాధితులకు కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై రామకృష్ణ నిప్పులు చెరిగారు.
Tags: CPI team inspected Polavaram