అధిక ధరలకు వ్యతిరేకంగా సీపీఎం అందోళన
కాకినాడ ముచ్చట్లు:
కేంద్ర బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, నిరుద్యోగం . అధిక ధరలు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై సి.పి.ఎం. సమరభేరి మ్రోగించింది. కాకినాడ నగర ప్రజలు ఆదరించాలని సి.పి.ఎం. నాయకులు విజ్ఞప్తి చేసారు. కాకినాడలోని అంబేధ్కర్ విగ్రహం వద్ద సి.పి.ఎం. జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జీ., సి.పి.ఎం. సమరభేరి ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందుకు తగిన విధంగా ప్రజల ఆదాయాలు పెరగలేదన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వివిధ రూపాల్లో భారీగా విద్యుత్ చార్జీలు వేస్తుందన్నారు. ఈ నేపధ్యంలో సి.పి.ఎం. సమరభేరి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, సంతకాలు చేయాలని కోరుతున్నామన్నారు. సి.పి.ఎం. నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు సామాన్య, ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మధ్యతరగతి కల్పించాలని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని సి.పి.ఎం. డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు మలక వెంకటరమణ, దుంపల ప్రసాద్, చంద్రమళ్ళ పద్మ, నర్ల ఈశ్వరి, మేడిశెట్టి వెంకటరమణ, పాలిక రాజేంద్రప్రసాద్, పెండెం సూర్యారావు, రాణి, విజయ్, రాజు, సాయి, వీరబాబు,నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Tags: CPM against high prices

