తుమ్మలగుంటలో ఇంటింటికి సిపిఎం ప్రచారం-కందారపు మురళి సిపిఎం

చంద్రగిరి ముచ్చట్లు:

 

చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం లోని తుమ్మలగుంట గ్రామంలో ఆదివారం నాటి ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం జరిగింది. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదని ధరలు విపరీతంగా పెరిగాయని గ్రామ ప్రజలు అభిప్రాయ పడ్డారని సిపిఎం జిల్లా నేత కందారపు మురళి తెలిపారు. ఆదాయం పెరగకపోగా ఉన్న ఉపాధి పోయిందని తుమ్మలగుంట గ్రామంలోని ప్రజలు సిపిఎం నేతలకు తెలిపినట్లు ఆయన వివరించారు. సమస్యల పరిష్కారానికై జూలై 11వ తేదీన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు తుమ్మలగుంట గ్రామంలో ఇంటింటికి సిపిఎం… జనం కోసం సిపిఎం పేరుతో కరపత్రాలు పంచి పెట్టామని సిపిఎం నేత జి. బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను ఆరా తీశారు.

 

Post Midle

Tags:CPM house-to-house campaign in Tummalagunta-Kandarapu Murali CPM

Post Midle
Natyam ad