సీపీఎం ఒక దివాళుకోరు పార్టీ : బీజేపీ నేత కిషన్ రెడ్డి

CPM is a bankrupt party: BJP leader Kisan Reddy

CPM is a bankrupt party: BJP leader Kisan Reddy

Date:23/04/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
సీపీఎం జాతీయ సభలు  ప్రధానమంత్రిని, బీజేపీని తిట్టడం తో ముగించారని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి విమర్శించారు.  సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  సీపీఎం హైదరాబాద్లో సభ పెట్టి కాంగ్రెస్ పార్టీతో పనిచేయాలని నిర్ణయించుకోవడం ఆపార్టీ దివాళకోరు తనానికి నిదర్శనమని అన్నారు. ఆ పార్టీ… బీజేపీని కౌరవులతో పోల్చిందని అయన అన్నారు. ‘ చిన్నా చితక పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి, కులం, మతం, భాష పేరుతో కూటములు కట్టే మీరు కౌరవులా? దేశం కోసం జాతీయ భావన సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతాపార్టీ కౌరవులా? అని అయన ప్రశ్నించారు. సీపీఎం పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, అలాంటప్పుడు పాండవులని ఏ రకంగా ఆ పార్టీ అనుకుంటుందో అర్థం కావడంలేదన్నారు. కేరళలోనే ఆ పార్టీ ఉందని, పశ్చిమబెంగాల్లో సీపీఎం పార్టీ రోజు రోజుకు కనుమరుగు అవుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. అక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉందని, సీపీఎం మూడో స్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు. కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.  జాతీయ సభల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పై వాళ్ళ వైఖరి చెప్పలేదు.. కమ్యూనిస్ట్ పార్టీ ల గోడలకు బీటలు వారాయని అయన అన్నారు. హైద్రాబాద్ లో జరిగే సభల లో దిశ నిర్దేశనం చేస్తారని కమ్యూనిస్ట్ వాళ్ళు ఎదురు చూశారని అయన అన్నారు. స్వతంత్ర వచ్చినపట్టి  నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన పాలనకు సీపీఎం కి బాధ్యత లేదా.  యూపీఏ హయంలో  జరిగిన అవినీతి కి సీపీఎంకు భాగ్యస్వామ్యం లేదా అని అయన అన్నారు. సీపీఎం రెండు గా విడిపోయి…సభలు నిర్వహించారు.. బీజేపీ తిట్టడం అంటే భారత ప్రజలను అవమానించడం. దేశం కోసం ఏ పార్టీ పని చేస్తుంది అనేది ప్రజలు నిర్ణయించారు. మతాల గూర్చి మాట్లాడారు. నాలుగు  సంవత్సరాల లో ఎక్కడా  మతఘర్షణలు లేవు. దిగ జారుడు రాజకీయాలు సీపీఎం కే సాధ్యమని అన్నారు. సీపీఎం పార్టీకి దమ్ము ధైర్యం వుంటే , మోడీ అవినీతి ని నిరూపించాలని అన్నారు. సీపీఎం కి కార్యకర్తలు తగ్గారు. ఎవరూ గుండాలో, ఎవరూ రౌడీలో, ఎవరూ హత్యలు చేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. సీపీఎం అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు
Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *