Natyam ad

జనవరి నుంచి సీపీఎస్ ఉద్యమం

గుంటూరు ముచ్చట్లు:


సీపీఎస్ రద్దు పోరాటాన్ని వచ్చే ఏడాది జనవరి నెల నుంచి పోరాటం చేస్తామని ఏపీ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ.. సంతకాల సేకరణ చేపట్టారు. నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు వంటి వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు అంటున్నారు. అప్పటికీ దిగిరాకపోతే ప్రభుత్వాన్ని దిగ్బంధిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు విభజన హమీలపై.. విశాఖ పర్యటనలో ప్రధాని మోడీని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షాల మేరకు పోరాటనికి సిద్ధం కావాలని.. అందుకు ఉద్యోగ సంఘాలు సైతం కలిసి వస్తాయని చెప్పారు. “ఈరోజు సీపీఎస్ విధానం కూడా కార్పొరేట్లకు లాభం చేకూర్చేవే. గ్యారంటీ లేనటువంటి పెన్న్ అని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం పెన్షన్ ను గ్యారంటీ అని చెప్తా ఉంది. అలాగే 33 శాతం ఇస్తామంటుంది. ఇప్పి వరకు ఏ ప్రభుత్వం కూడా ఉద్యమాలు చేస్తామని చెప్తే… హెచ్చరికలు వదిలేసింది తప్ప అరెస్టులు చేయలేదు. ఈ ఒక్క ప్రభుత్వం మాత్రమే కేసులు పెడుతూ భయపెట్టాలని చూస్తోంది. అయితే డిసెంబర్ వరకు ఇందుకు సంబంధించి సంతకాలు సేకరిస్తాం.

 

 

సీపీఎస్ ఉద్యోగి ఇంటింటికీ వెళ్లడం దానితోపాటు పాయాత్రలు చేయడం.. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జనవరి ఒకటి నుంచి ప్రభుత్వాన్ని నిర్బంధిస్తాం. అవసరమైన ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తాం.  సీపీఎస్ ను రద్దు చేయాల్సిందే. సీపీఎస్ ను అస్సలే అంగీకరించం” – యూటీఎఫ్సీపీఎస్ ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ సర్కారు అటకెక్కించినట్లేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించి అప్పుల వ్యవహారంలో వచ్చిన తాజా పరిణామంతో ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నిపుణులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ – సీపీఎస్ పథకంలోి ప్రభుత్వం, ఉద్యోగల వాటాను చూపించి ఏపీ సర్కారు కొత్త రుణాలను తీసుకోవాలని అనుకుంటోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి కూడా పొందింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి విషయాన్ని వెల్లడించారు.

 

Post Midle

Tags: CPS movement since January

Post Midle

Leave A Reply

Your email address will not be published.