జీహెచ్ఎంసీలో స‌రికొత్త‌గా సృజనాత్మ‌క విభాగం ఏర్పాటు

Creating a new creative section in GHMCC

Creating a new creative section in GHMCC

Date:11/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
దాదాపు కోటి మందికి పైగా జ‌నాభా క‌లిగిన హైద‌రాబాద్ న‌గ‌ర పాలనలో  కీల‌క పాత్ర వ‌హించే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ప్ర‌త్యేకంగా సృజ‌నాత్మ‌క విభాగాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణయించారు. 25వేల మందికిపైగా శాశ్వ‌త‌, తాత్కాలిక ఉద్యోగాలు క‌లిగి 30కి పైగా విభాగాలు ఉన్న జీహెచ్ఎంసీలో ప్ర‌తి విభాగంలో స‌రికొత్త ఆలోచ‌న‌లు, సంస్క‌ర‌ణ‌లు, ఆవిష్క‌ర‌ణ‌ల‌తో పాటు రానున్న మూడు ద‌శాబ్దాల‌ను దృష్టిలో పెట్టుకొని ఏవిధ‌మైన అభివృద్ది, ప్ర‌ణాళిక‌లు రూపొందించాలి, న‌గ‌ర నిర్వ‌హ‌ణ‌, ప్ర‌ణాళిక‌ల అమ‌లులో సిటీజ‌న్ల భాగ‌స్వామ్యాన్ని వీలైనంత అధికంగా క‌ల్పించ‌డం, త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేకంగా ఈ సృజ‌నాత్మ‌క విభాగం దృష్టి కేంద్రీక‌రిస్తుంది. ఇప్పటికే, జిహెచ్ఏంసి లోని అన్ని విభాగాల్లో పలు పరిపాలనా, నిర్వహణ సంబంధిత సంస్కరణలను ప్రవేశ పెట్టడం ద్వారా వనరుల వినియోగం, వ్యయంలో గణనీయమైన తగ్గుదల వచ్చింది. ఫైళ్ల నిర్వహణలో ఈ ఆఫీస్ విధానం ద్వారా అతి తక్కువ సమయం లో  ఫైళ్ల ను క్లియరెన్స్ చేయడం, సంక్లిష్టంగా ఉన్న విధానాలను సులభతరం చేయడం, అదనంగా ఉన్న వనరులను అవసరం ఉన్న విభాగాలకు  సర్దుబాటు చేయడం, ట్రాన్స్ పోర్ట్, శానిటేషన్, వ్యర్ధ పదార్థాలు నిర్వహణలో గణనీయమైన మార్పులు తేవడం ఇలా  అన్ని విభాగాలలో విస్తృత సంస్కరణలను  జి హెచ్ ఏం సి చేపట్టింది. దేశంలోని ఏ ఇతర  నగర పాలక సంస్థల్లోనూ  జి హెచ్ ఏం సి చేపట్టిన విధంగా సంస్కరణలు చేపట్ట లేదంటే అతి శయోక్తి కాదు. అయితే, శరవేగంగా సాగుతున్న నగరాభివృద్ధి, ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్ ప్రణాళిక  తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని జి హెచ్ ఏం సి లో సృజనాత్మక విభాగం (ఇన్నోవేషన్ సెల్) ను ఏర్పాటు చేయాలనీ రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కె టి.రామ రావు, మేయర్ బోతు రామ్మోహన్ సూచనల మేరకు ఇన్నోవేషన్ సెల్ ను ప్రత్యేకంగా  ఏర్పాటు చేస్తూ కమీషనర్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఐటి విభాగం అడిషనల్ కమీషనర్ గా  ఉన్న ముషారఫ్ అలీని ఇన్నోవేషన్ సెల్ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. మునిసిపల్ రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులు, ఆధునిక విధానాలు, సంస్కరణలను అధ్యయనం చేసి ఆయా ఫలితాలను జి హెచ్ ఏం సి లో ఎంత మేరకు అమలు చేయవచ్చనే విషయం విశ్లేషించి ఈ ఇన్నోవేషన్ సెల్ తగు మార్గదర్శకం చేస్తుందని కమీషనర్ చెప్పారు. వీటితోపాటు సంస్థలోని  అధికారులు, ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులనుండి కూడా తగు ఇన్నోవేటివ్ ఐడియాలను స్వీకరించడంతో పాటు, ఇతర సంబందిత శాఖల్లో అమలు చేసే వినూత్న విధానాలను కూడా ఈ సెల్అ ధ్యయనం చేస్తుందని వివరించారు. ఇప్పటికే జి హెచ్ ఏం సిలో ఇన్నోవేషన్ సెల్, స్ట్రాటిజిక్ ఇన్నోవేషన్ గ్రూపుల ల  పేరుతో వాట్స్ అప్ గ్రూప్ లు కూడా జి హెచ్ ఏం సి ఏర్పాటు చేసింది.
జీహెచ్ఎంసీలో స‌రికొత్త‌గా సృజనాత్మ‌క విభాగం ఏర్పాటుhttps://www.telugumuchatlu.com/creating-a-new-creative-section-in-ghmcc/
Tags:Creating a new creative section in GHMCC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *