Date:05/112/2020
బద్వేల్ ముచ్చట్లు:
ప్రతి మనిషి బ్రతికి ఉన్నప్పుడు అంగులు ఆర్భాటాలు చనిపోయాక కావల్సింది. ఆరడుగుల నేల కాని రాజకీయ నాయకులు మరియు అధికారుల నిర్లక్ష్యంతో ఆ గ్రామంలో దహన సంస్కారాలకు స్థలం లేకపోవడంతో రహదారి పక్కనే దహన సంస్కారాలు చేస్తున్నారు. వివరాలు ఇలా వున్నాయి. కడప జిల్లా బద్వేలు కడప ప్రధాన రహదారిని అనుకుని దహన సంస్కారాలు మృతుడి కుటుంబసభ్యులు నిర్వహించారు.బద్వేలు మండలం బయనపల్లి గ్రామస్థులకు స్మశానవాటిక అధికారులు కేటాయించలేదని రోడ్ పక్కనే దహన సంస్కారాలను కుటుంబీకులు జరిపించారు. ఇంతవరకు బయనపల్లి గ్రామంలో మృతి చెందిన వ్యక్తిలను గ్రామంలోని చెరువులో అంత్యక్రియలు నిర్వహించే వారు. ఇటీవల కురిసిన నివర్ వర్షాల వల్ల చెరువులు పూర్తిగా నిండిపోవడంతో కడప బద్వేల్ ప్రధాన రహదారి పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు తమ గ్రామానికి స్మశానవాటిక కేటాయించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
బావిలోకి దూసుకుపోయిన కారు..ప్రయాణికులు సురక్షితం
Tags: Cremations next to the road