పుంగనూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ -సీఐ రాఘవరెడ్డి
-రూ. 20 వేలు స్వాధీనం
పుంగనూరు ముచ్చట్లు:

క్రికెట్ బెట్టింగ్‌ల ముఠాలోని 5 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాఘవరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. పట్టణానికి చెందిన రంజిత్‌కుమార్, అఫ్సర్, నిరంజన్, సుహేల్‌బాషా, శివకుమార్ కలసి పట్టణంలోని సెంట్రల్‌లాడ్జిలో గల కరీమ్ టీస్టాల్‌లో ప్రపంచ కప్ ఇంగ్లాడ్ , ఇండియా మధ్య పోటీలపై బెట్టింగ్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం రావడంతో పట్టుకున్నామన్నారు. వారి వ ద్ద నుంచి రూ.20 వేలు , సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా , వారికి ఒకొక్కరికి రూ.300 లు జరిమాన విధించినట్లు ఆయన తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
Tags: Cricket betting gang arrested in Punganur – CI Raghavareddy
