విశాఖలో క్రికెట్ సందడి
విశాఖపట్నం ముచ్చట్లు
విశాఖ మరో అంతర్జాతీయ మ్యాచ్ కు వేదిక కాబోతోంది.క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమయ్యే సమయం సమీపిస్తున్న కొద్ది తమ అభిమాని క్రికేటర్ ను ఎప్పుడు చూద్దామా అని ఆశతో ఎదురు చూస్తున్నారు.విశాఖ గడ్డపై భారత్ విజయం సాధించాలని గంపెడాశతో ఉన్న అభిమానులు మ్యాచ్ టిక్కెట్లను దక్కించుకొని తెగ సంబర పడుతున్నారు.నువ్వా నేనా అంటూ హోరాహోరీగా సాగే మ్యాచ్ కోసం మరోవైపు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.భారీగా క్రికేట్ లవర్స్ తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
సుదీర్ఘ విరామం తర్వాత జరగనున్న వన్డే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విశాఖ వేదికగా ఈ నెల 19వ తేదీన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటి నుంచే టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఆన్‌లైన్‌లో ఈ నెల 10 నుంచే అందుబాటులో ఉంచగా.. ఆఫ్‌లైన్‌లో నేటి నుంచి విక్రయిస్తున్నారు.విశాఖ నగరంలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి మైదానం, జీవీఎంసీ మున్సిపల్ స్టేడియం, రాజీవ్‌గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. టికెట్ కౌంటర్ల వద్ద వేకువజాము నుంచే క్రికెట్ అభిమానులు బారులు తీరారు.టికెట్ల కోసం పలువురు మహిళలలు కూడా పోటీ పడ్డారు.

Tags;
Cricket buzz in Visakhapatnam
