Natyam ad

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్

హైదరాబాద్‌ ముచ్చట్లు:

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా సెప్టెంబర్ 5న ముంబైలో ‘800’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇటు సచిన్ ఇండియా తరఫున, అటు మురళీధరన్ శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. మైదానంలో పోటీ పడినప్పటికీ… మైదానం వెలుపల ఇద్దరు మధ్య మంచి స్నేహం ఉంది. మురళీధరన్ కోసం ‘800’ ట్రైలర్ విడుదల చేయడానికి సచిన్ వస్తున్నారు.

 

 

Post Midle

‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ విడుదల తర్వాత ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయనున్నారు. అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ విడుదల గురించి ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ”సచిన్ టెండూల్కర్ గారు మా ‘800’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో పాటు ప్రముఖ క్రికెటర్లు, సినీ ప్రముఖులు సైతం హాజరు కానున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు.మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రవీణ్ కెఎల్, సినిమాటోగ్రఫీ : ఆర్.డి. రాజశేఖర్, మ్యూజిక్ : జిబ్రాన్, రచన & దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి.

 

Tags:Cricket God Sachin Tendulkar as chief guest at Muttiah Muralitharan’s biopic ‘800’ trailer release event

Post Midle