విశాఖలో క్రికెట్ మానియా

Cricket Mania in Visakhapatnam

Cricket Mania in Visakhapatnam

Date:22/10/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇదో బంపర్ బొనాంజా గా భావిస్తూ తెగ సంబర పడిపోతున్న అభిమారులు ఇండియా,  వెస్టిండీస్ ఓన్డే మ్యాచ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.24న జరిగే మ్యాచ్ లో తలపడేందుకు ఆటగాళ్లు విశాఖకు చేరుకోవడం తో ఫుల్ షుషీగా చిందులేస్తున్నారు.  ఇండియా , వెస్టిండీస్ ఓన్డే క్రికెట్ మ్యాచ్ కు విశాఖ వేదికగా కానుంది. 24 న జరిగే ఇండియా , వెస్ట్ ఇండీస్ క్రికెట్ మాచ్ వన్ డే మ్యాచ్ జరగడంతో అభిమానులు సంబరాలు చేసుకుం టున్నారు.మ్యాచ్ జరిగేది ఒక్కరోజైనా కనీసం క్రీడాకారులను చూసే అవకాశం వచ్చిందని సంబర పడుతున్నారు. విశాఖ పిఎం పాలేం వద్ద ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం సిద్దం చేసిన టిక్కెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.
ఇదే కాకుండా పలు ప్రాంతాల్లో కూడా టిక్కెట్ల విక్రయాల కోసం కేంధ్రాలను కూడా సిద్దం చేశారు.దీంతో అభిమానులు క్యూకట్టి మరీ టిక్కెట్లును దక్కించుకుంటున్నారు.  24న జరిగే మ్యాచ్ ఇండియా టీమ్ కు ప్రత్యేక గుర్తింపు తెస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సెంచురీతో ఇండియ ఆటగాళ్లు చెలరేగి ప్రత్యర్ధి ఆటగాళ్లపై సత్తా చాటుతారని చెబుతున్నారు. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ గత మ్యాచ్ లో సాధించిన విజయం కంటే విశాఖలో జరిగే ఒన్డే మ్యాచ్ లో ప్రత్యేకతను చాటుకుంటారని చెబుతున్నారు. క్రికెట్ దేవుళ్లను ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని కనులారా వీక్షించేందుకు అభిమానులు తెగ ఉత్సాహాం చూపిస్తున్నారు. విశాఖ చేరుకున్న క్రికెట్ క్రీడాకారులకు ఘన స్వాగతం పలికిన అభిమానులు అదే ఉత్సాహాంతో మ్యాచ్ తిలకించేందుకు సిద్దమవుతున్నారు. విశాఖలో జరిగే మ్యాచ్ లో ఇండియా విజయం ఖాయమని చెబుతున్నారు.
Tags:Cricket Mania in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *