నర బలి కేస్ చేధించాం 

Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మూడు నెలల పసిపాప నరబలికేసును చేధించినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. గురువారం నాడు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు.  12 రోజల క్రితం జరిగిన నర బలి కేస్ ను చేధించాం. కేసులో మొత్తం 122 ఫోన్లు 54 సెల్ టవర్ లా డేటా   అనలైజ్ చేశామని అయన అన్నారు. మొత్తం 40 మంది సాక్షులను, 45 మంది అనుమానితులను విచారించాం. 100 సీసీ కెమెరాల డేటా ను పరిశీలించాం. రాజశేఖర్ తో పాటు భార్య శ్రీలత , ఒక మాంత్రికుడు పాపను తీసుకుని వచ్చిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని అన్నారు. కేసులో మొత్తం ఇప్పటి వరకు ఇద్దరిని  అరెస్ట్ చేశాం. భిన్నకోణాల్లో దర్యాప్తు చేసి చివరకు నర బలి జరిగినట్లు గుర్తించాం. ఇంటి యజమాని రాజశేఖర్ మాంత్రికుడు సలహా మేరకు పాపను నర బలి చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఘటన స్థలం లో లభ్యం అయిన నమూనాలతో ఫోరెన్సిక్ ల్యాబ్  నివేదిక సమర్పించింది.  డీఎన్ యే  రిపోర్ట్ ద్వారా అడా శిశువు గా గుర్తించ్చామని అన్నారు.
Tags; Narain Bali case is broken

సెక్స్ బొమ్మలతో బ్రోతల్ హౌస్

Date:15/02/2018
బ్రెజిల్ ముచ్చట్లు:
మారిన కాలంతో పాటు శృంగారం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రాచీన కాలంలో వేశ్యా గృహాలు ఉండటం తెలిసిన విషయమై. ఇప్పటికీ ముంబైలోని రెడ్ లైట్ ఏరియా, పుణేలోని బుధవార్ పేట‌ల్లాంటి ప్రాంతాలు వేశ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాయి. బ్రెజిల్ లాంటి దేశాల్లోనైతే వ్యభిచారానికి చట్టబద్ధత ఉంది. వారు ప్రభుత్వానికి పన్ను కడితే సరిపోతుంది. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా విశృంఖల శృంగారం వల్ల సుఖ వ్యాధుల బారినపడే ముప్పు ఉంది.అందుకే కొందరు మనుషుల బదులు సెక్స్ డాల్స్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో యూరప్‌ దేశాలు ముందున్నాయి. స్కాటాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ‘డేట్ ఏ డాల్ సర్వీసెస్ లిమిటెడ్’ పేరిట సెక్స్ బొమ్మలతో బ్రోతల్ హౌస్ ప్రారంభించాడు. గంటకు కేవలం 70 పౌండ్లు చెల్లించి మనిషిని తలపించేలా ఉన్న ఈ బొమ్మతో గంటసేపు శృంగారాన్ని ఆస్వాదించండని ప్రకటనలు గుప్పించాడు. ఈ బొమ్మలతో సెక్స్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపారు.కానీ ఈ వ్యవహరం పట్ల ఇరుగుపొరుగు వారికి చిర్రెత్తుకొచ్చింది. ఇళ్ల మధ్య ఇలాంటి పనులేంటయ్యా అని కోపడ్డారు. దీంతో అతడి బొమ్మల వేశ్యాగృహం ఒక్క రోజులేనే మూతపడింది. దీంతో సదరు వ్యక్తి ప్లాన్ మార్చాడు.ఇంట్లో పెడితేనే కదా తంటా.. అద్దెకిస్తే పోయే అనుకొని.. ఒక్కో బొమ్మని గంటకు ఇంత చొప్పున అద్దెకిస్తా.. మీతోపాటు తీసుకెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ కొత్త ఆఫర్ మొదలుపెట్టాడు. కస్టమర్లకు అనువైన చోటు తనే వెళ్లి మీటింగ్స్ మొదలుపెట్టాడు. ఎందుకైనా మంచిదని ముందుగానే ఎక్కువ మొత్తం డిపాజిట్‌గా తీసుకుంటున్నాడు. రోబోలతో వేశ్యా గృహం నిర్వహించడమే తన లక్ష్యమని ఆ దిశగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు.
Tags;Brothal House with sex toys

నేర రహిత సమాజం కోసం నేను సైతం

-డీజీపీ మహేందర్ రెడ్డి
Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
 తెలంగాణ వ్యాప్తంగా నేనుసైతం ద్వారా 10 లక్షల కెమెరాలు ఏర్పాటుయే లక్ష్యం. సీసీ కెమెరాలు ఉండడంతో చైన్ స్నాచింగ్ ఆగిపోయింది. తెలంగాణలో నేరం చేస్తే దొరికిపోతామనేది నేరస్థులు భయపడుతున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం నాడు రాచకొండ  కమిషనరేట్ పరిధిలోని ఆధిబాట్ల పోలీస్ స్టేషన్ 9 వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాల కమాండ్ కంట్రొల్ రూమ్ ను, అయన ప్రారంభించారు. ఆధిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు ఆధిబట్ల లో 16, బొంగ్లుర్ (16), తుర్క యాంజల్(18), రాగన్నగూడా(22), ఎంపీ పటేల్ గూడ(10), నాదర్ గుల్(23), కొంగర కలన్(15), కూర్మల్ గుడా(13), రావిర్యాల(17)  మొత్తం 150 కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను అయన ప్రారంభించారు. ఆధిబట్ల పరిధిలో మొత్తం 350 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కెమెరాలను వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి నేర రహిత సమాజానికి నేను సైతం అను తెలంగాణ పోలీస్ ల నినాదానికి ముందుకొచ్చి తమ వంతుగా విరాళాలు అందజేయడంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ కెమెరాలకు వివరాలను అందజేసిన దాతలకు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డీజీపీ మాట్లాడుతూ -100 మంది పని ఒక సీసీ కెమెరా చేస్తోంది. కెమెరా 24 గంటలు పని చేస్తోంది. కెమెరాలో రికార్డ్ అయి ఆ సాక్ష్యం కోర్ట్ నమ్ముతుందని అన్నారు. ఇప్పటికే ప్రజల భాగస్వామ్యంతో 2 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం చాలా భద్రత ఉన్న రాష్ట్రంగా పేరు పొందుతుంది. తెలంగాణలో ఇతర రాష్ట్రాల,ఇతర దేశాల వారు హైదరాబాద్ నగరం భద్రతకు మంచి పేరు ఉందని మన రాష్ట్రం లో పెట్టుబడి పెడుతున్నారని అయన అన్నారు. టెక్నాలజీ వాడుకొని సాక్ష్యాలను వాడుతున్నాం. వీడియో లలో చిత్రికరిస్తూ డ్రంకెన్ డ్రైవ్ లు చేస్తున్నామని అన్నారు.
Tags: For the crime free society too

తుఫాన్‌ వాహనం బోల్తా..ఐదుగురికి గాయాలు

Date:15/02/2018

వనపర్తి జిల్లా ముచ్చట్లు:

కొత్తకోట మండలం పాలెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 44 పై, హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తున్న తుఫాన్‌ వాహనం వెనుక టైరు ఉడిపోయి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags: The hurricane of the storm

రోడ్డు ప్రమాదంలో అన్నా తమ్ముడు మృతి

Date:15/02/2015

సిద్దిపేట ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదంలో అన్నా తమ్ముడు మృతిచెందిన విషాద సంఘటన గురువారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కడారి రాంబాబు(40), కడారి చందు(32) అనే ఇద్దరు అన్నాతమ్మడు. అయితే… వీరిని గురువారం ఉదయం గుర్తు తెలియని వాహపం ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా… అన్నాతమ్ముడు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Tags: Anna’s brother killed in road accident

భార్యాబాధితుడి కేసులో కొత్త మలుపు

సాక్షి

Date :24/01/2018

లాయర్‌ ప్రోద్భలంతోనే నా భార్యపై కేసు పెట్టా

రాష్ట్రంలో తొలిసారి దాఖలైన భార్య వేధింపుల కేసులో భర్త వ్యాఖ్యలు

లాయర్‌పై చర్యలు  తీసుకోవాలంటూ  హైడ్రామా

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) :  తనకు ముందే పెళ్లయి విడాకులు తీసుకున్న విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా, అదనపు కట్నం తీసుకురమ్మంటూ తన భార్య వేధిస్తోందని రాష్ట్రంలో తొలిసారిగా ఓ భర్త తన భార్యపై దాఖలు చేసిన గృహ హింస కేసు కొత్తమలుపు తిరిగింది. తాము రాజీపడి జీవిస్తున్నా కూడా లాయర్‌ డబ్బుల కోసం తమను వేధిస్తున్నాడని, తమ అంగీకారం లేకుండా మీడియాకు తమ వివరాలను వెల్లడించాడని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ భార్యాభర్తలిద్దరూ మంగళవారం నున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో అక్కడ హైడ్రామా నడిచింది. వివరాల్లోకెళ్తే.. నున్న ప్రాంతానికి చెందిన సాయిచైతన్య (28) అనే మహిళ, విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్‌ ప్రాంతానికి చెందిన గోగు రామ్‌కుమార్‌ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే సాయి చైతన్యకు ముందుగానే వేరే వ్యక్తితో వివాహమై, పిల్లలు కూడా ఉన్నారని ఆ విషయాలను ఆమె తనకు చెప్పకుండా దాచి వివాహం చేసుకోవడంతో పాటు తనను అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురిచేస్తోందంటూ భర్త రామ్‌కుమార్‌ తన భార్యపై గృహహింస కేసు పెట్టాడు.

భార్య బాధితులు కూడా గృహహింస నిరోధక చట్టం ద్వారా కేసు దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేసును నమోదు చేశారు. దీంతో ప్రసార మాధ్యమాల్లో ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకొని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని, లాయర్‌ ప్రోద్భలంతోనే తన భార్యపై కేసు పెట్టాల్సి వచ్చిందంటూ బాధితుడు రామ్‌కుమార్‌ ప్లేట్‌ ఫిరాయించాడు. తన భార్యతో విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని తనకు న్యాయం చేయాల్సిందిగా లాయర్‌ పుప్పాల శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లగా లక్ష రూపాయలు ఫీజు అడిగారని, ఇందులో రూ.40 వేలు చెల్లించామని తెలిపారు. అయితే ఆ తరువాత భార్యభర్తలిద్దరం రాజీపడి  20 రోజుల నుంచి కలిసి జీవిస్తున్నారు. ఈ విషయం లాయర్‌కు చెబితే నువ్వు అలా చేయడం కరెక్ట్‌ కాదని, మిగిలిన రూ.60 వేలు ఫీజు కట్టాలని అడుగుతూ వాటిని ఇవ్వలేదనే అక్కసుతో తమ ప్రమేయం లేకుండా తమ పేర్లను మీడియాకు చెప్పాడని ఆరోపించారు. దీనివల్ల తమ కుటుంబ పరువు పోయిందని లాయర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కాగా పోలీసులు పరువునష్టం కేసు కోర్టులో వేసుకోవాలంటూ చెప్పి పంపారు.

రైలు క్రిందపడి వ్యక్తి ఆత్మహత్య

Date:23/01/2018

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు పట్టణంలో రైలు క్రిందపడి రఘు(35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జిడి నెల్లూరు మండలం కనికపురం గ్రామానికి చెందిన రఘు ఆత్మహత్యకు పాల్పడిన వివరాలు తెలియరాలేదు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Tags : The person committed suicide by train

లోయలోపడ్డ బస్సు – 30 మందికి గాయాలు

Date:23/01/2018

తిరుపతి ముచ్చట్లు:

బాకరాపేట లోయలో మదనపల్లె రెండవ డిపోకు చెందిన బస్సు పడిపోవడంతో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలైయ్యారు. ప్రయాణికులను కాపాడేందుకు గ్రామస్తులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతి ఆసుపత్రికి తరలించారు.

Tags : Injured bus – 30 injured