అక్రమంగా  రేషన్ బియ్యం విత్ డ్రా చేసిన ఆరుగురు డీలర్లపై క్రిమినల్ కేసులు 

Date:04/09/2020

ఐదుగురు విఆర్ఏలు ఒక వీఆర్వో  సస్పెండ్

కామారెడ్డి ముచ్చట్లు:

అక్రమంగా రేషన్ బియ్యాన్ని విత్ డ్రా చేసినందుకు ఆరుగురు రేషన్ షాప్ డీలర్ల షాపులను సీజ్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేసారు. ఐదుగురు విఆర్ఎలు, ఒక విఆర్ఓను సప్పెండ్ చేసి క్రిమినల్ కేసు బుక్ చేస్తూ జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఉత్తర్వులను జారీ చేశారు.వేరే జిల్లాకు చెందిన రేషన్కార్డుల బియ్యాన్ని మన జిల్లాలో బయోమెటిక్ విధానంలో అక్రమంగా విత్ డ్రా చేసి నల్లబజారుకు తరలించిన నేపథ్యంలో సంబంధిత తహశీలుదార్లతో విచారణ జరిపించి, విచారణ నివేదికల ప్రకారం రేషన్ డీలర్లు బీర్కూర్ మండలం బీర్కూర్ గ్రామం ఎ.నర్సింహులు, పెద్దదామరంచ గామ డీలర్ ఎం.పెద్దరాజులు, తిమ్మాపూర్ గ్రామ డీలర్ కె. నాగరాజు, బాన్సువాడ మండలంలోని బాన్సువాడ పట్టణ డీలర్లు ఎం.ఎ.ఖయ్యూం, అసద్ బిన్ మోసిన్, ఎల్లారెడ్డి మండల కేంద్రం డీలర్ ఎన్.సురేందర్ లకు సంబంధించిన రేషన్ షాపులను సీజ్ చేసి, క్రిమినల్ కేసులు బుక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.బీర్కూర్ మండలంలోని బీర్కూర్ గ్రామం విఆర్ఎ వై.లింగం, పెద్దదామరంచ విఆర్ఎ ఎ.రవి, తిమ్మాపూర్ విఆర్ఎ జే.గంగాధర్, బోర్లాం విఆర్ఎ ఎం.డి.రఫి, ఎల్లారెడ్డి విఆర్ఎ ఆర్.వినోద్ కుమార్, బాన్సువాడ విలేజీ రెవిన్యూ అధికారి షాబుద్దీన్ ను సర్వీసు నుండి సస్పెండ్ చేస్తూ వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

 

మాస్క్ ధరించని దుకాణ యజమానులకు జరిమానా 

Tags:Criminal cases against six dealers for illegally withdrawing ration rice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *