ప్రజా సేవకుడుమంత్రి పెద్దిరెడ్డి పై విమర్శలు చేస్తే సహించం : వైకాపా

తిరుపతి ముచ్చట్లు:

ప్రజలకు పాలకుడుగా కాకుండా సేవకుడిగా పనిచేస్తున్న  రాష్ట్ర మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైచౌకబారు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్ డి ఎస్ చైర్మన్ కళ్యాణ్ భరత్ ఎంపీపీ గాజుల రామ్మూర్తి సింగిల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డిలు హెచ్చరించారు.ఇటీవల తిరుపతిలో జరిగినజనసేన జనవానిలో చౌడేపల్లి కు చెందినకొందరు వ్యక్తులుచెప్పిన మాటలు వినిపవన్ కళ్యాణ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడంపై మండలవైకాపా నాయకులు పాలకులు స్థానికపరిపాలన భవనం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ2019 మే 8న స్థానిక పోలీస్ స్టేషన్కు సమీపంలోఇన్నోవా వాహనం ద్వారా రోడ్డు ప్రమాదం యాదృచ్ఛికంగా సంభవించిన సంఘటననురాజకీయం చేయడం తగదన్నారు. కాగా అదే సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని బాధితులకు రూ 13 లక్షల వరకు అందజేయడం జరిగిందన్నారు .అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేదని ఆ సంఘటనలో కొందరు పోలీస్ స్టేషన్పై దాడి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినందున పోలీసులు 17 మందిపై కేసు నమోదు చేశారని గుర్తు చేశారు.ఆ విధంగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనను రాజకీయం చేసేందుకు చూస్తున్నారన్నారు .తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ నిజా నిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం తోపాటు పుంగనూరు నియోజకవర్గ సైతం అభివృద్ధి పథంలో పయనిస్తుందని రాష్ట్ర దేశ రాజకీయాల సంచలనంగా పేరు గడించినమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు కారు ద్వారా యాదృచ్ఛికంగా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని లారీ ద్వారా చంపించడం అనడం సమంజసం కాదన్నారు .ఎవరో చెప్పిన మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపా ప్రభుత్వం పైన చౌకబారు విమర్శలు మానుకోకుంటే రాబోయే కాలంలో ప్రజలతోపాటు తాము సైతం తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో ఎంపీటీసీ శ్రీరాములు సర్పంచ్ ఓబుల్ రెడ్డి వైకాపా నాయకులు పద్మనాభరెడ్డి శంకర్ రెడ్డిశివన్న తదితరులుు పాల్గొన్నారు.

 

Tags: Criticism of Public Servant Minister Peddireddy will not be tolerated: Vaikapa

Leave A Reply

Your email address will not be published.