-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్
Date:25/01/2021
కామారెడ్డి ముచ్చట్లు:
ఫిబ్రవరి 3 లోగా పంటల నమోదును పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లు టెలీ కాన్ఫరెన్స్ లో వ్యవసాయ అధికారులతో పంటల నమోదు ప్రక్రియను.సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే క్రాప్ బుకింగ్ జరిగిందని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రతి గుంటలో వేసిన పంటలను నమోదు చేయాలని ఆదేశించారు. రైతు బంధు సమితి సభ్యులతో వ్యవసాయ విస్తరణ అధికారులు చర్చించి, రైతు వేదికలను స్థానిక ఎమ్మెల్యేలతో మూడు రోజుల్లో ప్రారంభించాలని సూచించారు. అవసరమైన ఫర్నిచర్ ను సమకూర్చు కోవాలన్నారు. రైతు బీమా సెటిల్మెంట్ పెండింగ్ లో లేకుండా చూడాలని కోరారు.రైతు బీమా వివరాలు అప్లోడ్ చేయడం లో వ్యవసాయ అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెలీ కాన్ఫరెన్స్ లో అసిస్టెంట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా వ్యవసాయ అధికారి ని సునీత, వ్యవసాయఅధికారులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags:Crop registration should be completed by February 3.