పుంగనూరులో పంటలను ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలి- డిప్యూటి డైరెక్టర్‌ హబీబ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

రైతులు పండించే పంటలను ఈక్రాప్‌లో నమోదు చేసి , ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పొందాలని భూసార పరిరక్షణ కేంద్రం జిల్లా డిప్యూటి డైరెక్టర్‌ హబిబ్‌బాషా సూచించారు. మంగళవారం ఆయన, ఏడిలు శివకుమార్‌ , జ్యోతిర్మ లు కలసి పట్టణ సమీపంలోని మేలుపట్లలో వరి, వేరుశెనగ పంటలను పరిశీలించారు. రైతు కాంతరాజుతో పంటల దిగుబడి పై చర్చించారు. డీడీ మాట్లాడుతూ రైతులు ఈక్రాప్‌లో నమోదు చేసుకున్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే ఇన్సూరెన్స్, సబ్సిడి రుణాలు , పంట ఆర్థిక సహాయం నమోదు చేసుకున్న వారికి మాత్రమే అందుతుందన్నారు. అలాగే రైతులందరు ఆయా ప్రాంతాలలోని ఆర్‌బికెలకు వెళ్లి తమకు అవసరమైన సలహాలు, సూచనలను సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు . ఈయన వెంట ఏవోలు కళ్యాణబాబు, దీప, వీఆర్‌వో శ్రీపతిరెడ్డి, ఏఈవో జయంతి పాల్గొన్నారు.

Tags: Crops should be registered in eCrop in Punganur – Deputy Director Habib Basha

Leave A Reply

Your email address will not be published.