Natyam ad

వర్షంలో పంటలను ఒబ్బిడి చేయరాదు -ఏడి శివకుమార్‌

పుంగనూరు ముచ్చట్లు:

ఛాంపింగ్‌ తుఫాన్‌ వర్షాలలో రైతులు పండించిన పంటలను ఒబ్బిడి చేయరాదని ఏడి శివకుమార్‌ సూచించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్షాలు కారణంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వరి పంటను కోయరాదన్నారు. వర్షపు నీటిలో పంటలు కోస్తే గింజ గట్టిపడకుండ మెలకెత్తడం, రంగు మారడం జరుగుతుందన్నారు. దీని కారణంగా గిట్టుబాటు ధర లభించదన్నారు. వర్షంలో తడిసిన పంటకు లీటరు నీటికి ఒక గ్రాము కార్భెండిజం, రెండు గ్రాముల మ్యాంకోజెట్‌ను లేదా ప్రోపికొనల్‌జోల్‌ను కలిపి పిచికారి చేస్తే పంట రంగుమారదన్నారు. వరిపంటలను కోసి ఉంటే కట్టలు కట్టి టార్ఫాలిన్‌ వేసి కప్పాలని , అలాగే 25 కేజిల ఉప్పు ద్రావణాన్ని పంట తడిసిఉంటే చల్లాలన్నారు. మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తుందని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే ఆర్‌బికెలలోని వ్యవసాయశాఖ వారికి లేదా తమకు తెలియజేయాలని సూచించారు.

 

Post Midle

Tags: Crops should not be flooded in rain – AD Sivakumar

Post Midle