భారీ వర్షానికి నీట మునిగిన పంటపొలాలు

Date:14/09/2020

నల్గోండ ముచ్చట్లు:

ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటపొలాలు నీట మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో చోటు చేసుకుంది రాత్రి కురిసిన వర్షంతో చెరువులు, కుంటలు పాంగిపొర్లుతున్నయి మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు అలుగులు పొస్తుండడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది,వలిగొండ లోతట్టు ప్రాంతాల్లో  ఇండ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధులని చెరువులను తలపిస్తున్నాయి. చేతికి వచ్చిన వరి చేనులు నీట మునిగి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపొలాలలో వరద నీరు మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి.చెరువు అలుగులు పొస్తుండడంతో  రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వలిగొండ-లింగరాజుపల్లి, వలిగొండ-సుంకిశాల, నర్సాయిగూడెం-ఆరూర్, సంగెం- బోల్లేపల్లి, గోకారం-జాల్ కాల్వ, వెల్వర్తి-ఆరూర్, నర్సాయిగూడెం-లోతుకుంట, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

 

సాగర్ లో పెరిగిన వరద నీరు

Tags:Crops submerged by heavy rains

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *