Natyam ad

కళాశాల ఆవరణంలో ఉన్న వృక్షాలను అడ్డగోలుగా నరికివేత

-పట్టించుకోని అధికారులు

పెడన ముచ్చట్లు:

పెడన షాప్ క్రీడల పోటీలను పురస్కరించుకుని పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని పెద్ద పెద్ద వృక్షాలను అడ్డగోలుగా నరికి వేశారు. 30 ఏళ్ల గతం కళాశాల ఆవరణలో నాటిన మొక్కలు నేడు పెద్దపెద్ద వృక్షాలుగా ఎదిగి నీడనిస్తున్నాయి . ఈ చెట్లను అనుమతులు లేకుండానే నిర్ధాష్టంగా నరికివేసి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావు ఆరోపించారు. క్రీడల పోటీల నిర్వహణకు ఎక్కడో కళాశాల ఆవరణలో మూలలో ఉన్న చెట్లను నరికి వేయడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం అనుమతులు లేకుండా చెట్లను నరికి పర్యావరణకు హాని కలిగిస్తున్న ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై ఇంటర్మీడియట్ బోర్డ్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

 

Post Midle

Tags; Cross-cutting of trees in the college premises

Post Midle