Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి ఆలయoలో భక్తుల రద్దీ

చౌడేపల్లె ముచ్చట్లు:

శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ చోటుచేసుకుంది. వేలాదిగా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పాలక మండలి అధ్యక్షులు శంకరనారాయణ, ఈవో చంద్రమౌళిలు భక్తులకు మెరుగైన వసతుల కోసం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బందికి ఐడి కార్డులను అందజేశారు. అలాగే దసరా ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు వెంకటరమణారెడ్డి, పూర్ణిమ రాయల్ మోహన్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Crowd of devotees at Sri Boyakonda Gangamma Ammavari Temple

Post Midle