Natyam ad

తిరుమలలో పెరిగిన భక్తుల ర‌ద్దీ

– శ్రీవారి దర్శనానికి 30 గంటలు

-శిలా తోరణం వద్దకు చేరుకున్న క్యూలైన్లు

తిరుమల ముచ్చట్లు:

Post Midle

పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ అక్టోబర్ 5 మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. గురువారం ఉదయం 10 గంటలకు క్యూలైన్లు శిలా తోరణం వద్దకు చేరుకున్నాయి.తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరుతోంది.

Tags: Crowd of devotees increased in Tirumala

Post Midle

Leave A Reply

Your email address will not be published.