Natyam ad

శ్రీవారి ఆలయ ప్రాంగణములో యాత్రికుల రద్దీ

స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు

ద్వారకాతిరుమల ముచ్చట్లు:


శ్రీనివాసా గోవిందా.. వెంకటరమణా గోవిందా అంటూ స్వామి వారి ఆలయానికి వచ్చిన యాత్రికులు, భక్తివిశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. శ్రీవారి పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శనివారం భక్తుల రాకతో కళకళలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి దాదాపు 10వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించినట్లు ఆలయవర్గాలు భావిస్తున్నాయి. పెరిగిన భక్తుల రద్దీ ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికలు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీవారి సాధారణ దర్శనానికి సుమారు 2 గంటల పైబడి సమయం పట్టింది.భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

 

Post Midle

Tags; Crowd of pilgrims in Srivari temple premises

Post Midle