సమ్మగిరి లో పర్యాటకుల సందడి
అల్లూరి ముచ్చట్లు:
కొండకోనల నుంచి కిందకు దూకే సమ్మ గిరి జలపాతం పర్యాటకులను విశేషం గా ఆకట్టుకుంటుంది.అల్లూరి సీతారా మరాజు జిల్లా మన్యంలో లంబసింగి వచ్చే ప్రతి పర్యటకులు ఈ సమ్మగిరి రావడంతో పర్యాటకలతో కిటకిట లాడుతుంది. పచ్చని ప్రకృతి నడుమ ఈ ఎత్తైన జలపాతంలో సేదీరడం చా లా ఆనందంగా ఉందంటున్నారు పర్య టకులు.కనుచూపు మేరంతా పచ్చద నం..మధ్యలో చూడచక్కగా కనిపించే జలపాతం ఇది.జలపాతం అందాలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుం చి చాలా మంది నిత్యం తరలివస్తున్నా రు.జలపాత అందాలు కెమెరాల్లో బంధిస్తూ, సెల్ఫీలతో యువతీయువకు లు హంగామా చేశారు. హొయలుపో తున్న ఈ ప్రకృతి అందాన్ని చూసేందు కు దూర ప్రాంతాల నుంచి పర్యాట కులు పెద్ద సంఖ్యంలో వచ్చి సందడి చేస్తున్నారు.
Tags: Crowd of tourists in Sammagiri

