Date:30/11/2020
వేములవాడ ముచ్చట్లు:
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్బంగా భక్తుల రద్దీ తో సందడి గా మారింది. కార్తీక పౌర్ణమి మూడో సోమవారం కావడంతో రాజన్న క్షేత్రానికి భక్తులు అధిక శాతం తరలి వచ్చి 3 గంటల పాటు క్యూలైన్ లలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. .అధిక సంఖ్యలో భక్తులతో ఆలయం లోని క్యూలైన్లు కిట కిటలాడాయి. శివునికి ప్రీతిపాత్రమైన మాసమైన కార్తీక మాసం లో శివపార్వతులను దర్శించుకొని అనుగ్రహం పొందుతే పాపాలు మాటుమాయం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి వారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్ లో భక్తులు నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయ అర్చకులు స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన భక్తుల కొంగు బంగారంగా పిలిచే ఎములాడ రాజన్న సన్నిధిలో కోడె మొక్కుల భక్తులు మొక్కులు చెల్లించు కున్నారు. అయితే గర్భగుడి దర్శనం, అభిషేకంలకు మాత్రం భక్తులకు అలయ అధికారులు అనుమతించడం లేదు.
మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం
Tags: Crowds of devotees in the presence of the king