CRPF jawan Srinivasan killed

సీఆర్‌పీఎఫ్‌ జవాను శ్రీనివాసులు మృతి

Date:16/09/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలోని అనంతనాగ్‌ జిల్లా లేతపుర ప్రాంతంలో సీఆర్‌పిఎఫ్‌ జవానుగా విధులు నిర్వహిస్తున్న టి.శ్రీనివాసులు(27) బుధవారం మృతిచెందాడు. మృతుని కుటుంభీకులు తెలిపిన వివరాల మేరకు చౌడేపల్లె మండలంలోని కాటిపేరికి చెందిన మారప్ప, ముత్యాలమ్మల కుమారుడు గత నాలుగేళ్ల క్రితం సీఆర్‌పిఎఫ్‌ జవానుగా ఎంపికై విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం 7:30 ప్రాంతంలో తన తల్లి ముత్యాలమ్మ,సోదరుడు వంశీతో ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి గంట తరువాత మృతిచెందాడని అక్కడి అధికారులు కుటుంభీకులకు ఫోన్‌ద్వారా తెలిపినట్లు వివరించారు. శ్రీనగర్‌ సమీపంలోని లేతపుర శి క్షణా ప్రాంతంలో జరిగినట్లు తెలిపారు. కాగా ఎలా మృతిచెందారని తెలియాల్సి ఉంది. మృతునికి అధికార లాంఛనాలతో గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. జవాను మృతితో కాటిపేరిలో విషాధ ఛాయలు అలుముకొన్నాయి.

వేలం పాటల ద్వారా రూ:2.31లక్షలు ఆదాయం

Tags: CRPF jawan Srinivasan killed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *