చింతపల్లిలో సీఆర్పీఎఫ్ అధికారుల పర్యటన

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో సిఆర్పి ఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మీ శుక్ల , ఆ శాఖ ఐజీ మహేష్ చంద్ర లడ్డా పర్య టించారు.ఈ సందర్భంగా చింతపల్లి సి అర్ ఎఫ్ క్యాంప్ కార్యాలయంను సందర్శించారు. జులై 1 న మావోలు ఎ.ఒ.బి. బంద్  కు పిలుపునిచ్చిన నేపధ్యంలలో వారు పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మన్యంలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ శాఖ సిఅర్పిఎఫ్ జవాను లతో అదికారుల తో సమీక్ష సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చిం చారు.   మన్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించి తీసుకోవ లసిన జాగ్రత్తలపై సూచనలు సల హాలు ఇచ్చారని సమచారం. చింతపల్లి  ఎ యస్ పి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జూలై 1న మావోయిస్టులు తలపెట్టిన బంద్ కారణంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లు చోటు చేసుకోకుండా సాధారణ తనిఖీలు తో పాటు బాంబు స్క్వాడ్, డ్రోన్ సహాయంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి బంద్ ను భగ్నం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags:CRPF officers visit Chintapalli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *