విభజన హామీలు నేరవేర్చండి

Crush divide guarantees

Crush divide guarantees

Date:18/09/2018
బెంగళూరు ముచ్చట్లు:
బెంగుళూరులో విధానసౌధలో కేంద్రం హోంమంత్రి రాజనాథ్ సింగ్ అధ్యక్షతన జరిగి 28వ దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కోన్న అంశాలు, రాజ్యసభలో ప్రదానమంత్రి ఇచ్చిన హామీలు, కోస్టల్ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు సమస్యలు, రెడ్ సెండల్ స్మగ్లింగ్ ను అరికట్టడం, టూరిజిమ్ అభివృద్ధి,  కేంద్ర ప్రభుత్వ పథకాలపై మంత్రి యనమల రామకృష్ణుడు కౌన్సిల్ సమావేశంలో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలు నాల్గు సంవత్సరాలు గడిచినా ఇప్పటికి వరకు వాటిని అమలు చేయలేదని సమావేశంలో యనమల తెలియజేసారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందున ఆంధ్రప్రదేశ్ 5కోట్ల ప్రజలు నిరసన తెలియజేస్తున్నారని, విభజన చట్టంలో చెప్పినవి, ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారుచట్టంలో ప్రధానంగా ఇచ్చిన 14 హామీలు, ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని అయన తెలియజేసారు.
షెడ్యూల్ 9, 10, 11, 13 లో ఉన్న అంశాలను ఒక్కటీ కూడా పరిష్కరించలేదన్నారు. షెడ్యూల్ 9, 10లో ఉన్న ఆస్తులు, అప్పులు పంపకాలు జరగలేదని కౌన్సిల్ దృష్టికి మంత్రి తీసుకొచ్చారు. కోస్టల్ ప్రాంతంలో ఉన్న మత్సకారుల ఇబ్బందులు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం  రూ.16.5 కోట్లు కేటాయించాలని మంత్రి  కోరారు. దేశంలో అత్యధిక కోస్టల్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మచీలిపట్నం మరియు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్స్ అభివృద్ధికి రూ.1533 కోట్లు అవసరం అందులో రూ.766 కోట్లు గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేయాలని యనమల కోరారు.
పులికాట్ సరస్సు అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించాలని అయన కోరారు. రెడ్ సాండల్ అక్రమ రవాణా అరిక్కట్టడానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కలిసి చర్యలు తీసుకోవాలని మంత్రి  తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి చెన్నె, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం ట్రైన్ ప్రవేశపెట్టాలని మంత్రి కోరారు.
Tags:Crush divide guarantees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *