నూతన ఐఏఎస్ ఆధికారులకు సిఎస్ అనిల్ చంద్ర పునేఠ భేటీ

CS Anil Chandra Punna direction for IAS officials

CS Anil Chandra Punna direction for IAS officials

Date:31/12/2018
అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 2017 బ్యాచ్ శిక్షణా ఐఏఎస్ అధికారులు సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠతో భేటీ అయ్యారు.ఈసందర్భంగా సిఎస్ పునేఠ యువ ఐఏఎస్ అధికారులకు తన అనుభవాలను తెలియజేయడం తోపాటు ఉత్తమ అధికారులుగా ఏ విధంగా పేరుతెచ్చుకోవాలనే దానిపై పలు అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు.రాష్ట్ర విభజన అనంతరం నూతన రాష్ట్రంలో పనిచేసే అవకాశం కలగడం అదృష్టంగా భావించి కష్టించి పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.నూతన రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని బాగా పనిచేసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈసమయంలో యువ ఐఏఎస్ అధికారులుగా ఇక్కడ పనిచేయడం రాష్ట్రానికి మేలుకలగడమే గాక మీకు మీసర్వీసులో ఒక చెరగని ముద్రగా గుర్తు ఉంటుందని సిఎస్ పునేఠ్ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సయమంలో అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెల్సుకుని సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు.ప్రస్తుత నూతన రాష్ట్రం అనేక సమస్యలు,సవాళ్లను ఎదుర్కొంటోందని అలాంటి సమస్యలు,సవాళ్లను పరిష్కరించుటలో యువ ఐఏఎస్ అధికారులుగా మీ బాధ్యతలను మరింత సమర్ధవంతంగా నిర్వహించి రాష్ట్రానికి మరింత మంచి పేరు ప్రఖ్యాతలు  తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని సిఎస్ సూచించారు.శిక్షణలో భాగంగా తనతో భేటీ అయి వివిధ అంశాలను,అనుభవాలను తెల్సుకోవడం మీకు కెరీర్ లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ యువ ఐఏఎస్ అధికారులకు చెప్పారు.
ఈకార్యక్రమంలో 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ రోనాకి, కొత్తమసు దినేష్ కుమార్, ధ్యానచంద్ర హెచ్ యం, కెఎస్.విశ్వనాధన్, పవీణ్ ఆదిత్య సివి, నిశాంత్ టి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్,సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు.
Tags:CS Anil Chandra Punna direction for IAS officials

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed