ఎల్జీ ఘటనపై సీఎస్ సమీక్ష

Date:09/05/2020

అమరావతి ముచ్చట్లు:

విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ విషయంలో తక్షణమే జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టినట్లు ఏపి సిఎస్ నీలం సహానీ తెలిపారు.సుమారు 11వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని,17 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.454 ఆసుపత్రిలో చేరారని,వారిలో 20 మంది పరిస్థితి విషమం గా ఉందని తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై మంత్రుల బృందం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ ఘటనలో 12 మంది మృతి చెందారని,ఘటనాస్థలంలో గాలిలో స్టైరిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని చెప్పారు.ఎల్ జి పాలిమర్స్ కంపెనీ కు దక్షిణంగా ఉన్న వెంకటాపురం లో గాలిలో స్టైరిన్ శాతం కొద్దిగా ఎక్కువ ఉందని,మిగిలిన వైపు సాధారణ స్థాయిలో స్టైరిన్ ఉందని తెలిపారు.మరో 48 గంటల్లో అక్కడ కూడా స్టైరిన్ తగ్గుముఖం పట్టి సాదారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నట్లు వివరించారు.కంపెనీ కు దక్షిణంగా ఉన్న ఐదు గ్రామాల ప్రజలు మరో 48 గంటలు పాటు బయటే ఉండాలని,వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

 

 

 

 

మృతులు, క్షతగాత్రులకు పరిహారం కు సంబంధించిన ప్యాకేజి ను ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం జరిగిందని,అవసరమైన నిధులను కూడా విడుదల చేయడం జరుగుతుందని వెల్లడించారు.త్వరలో పరిహారం చెల్లిస్తున్నామని,ఈ ఘటన పై సమగ్ర విచారణ కు కమిటీ వేయడం జరిగిందని,ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.గ్యాస్‌ లీకేజీని అదుపులోకి తీసుకు వస్తున్నామని, బాధితులందరూ కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఘటనా ప్రాంతంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.స్టెరైన్ను నియంత్రించడంతో పాటు బాధితుల పరిస్థితులపైచర్చించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్పందించామని ఆమె తెలిపారు.

 

 

 

 

 

454 మంది బాధితులు ఆసుపత్రికి చికిత్స పొందడానికి వచ్చారని, పదివేల మంది ప్రజలకు తాము వసతి, భోజన సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.
గ్యాస్‌ దుర్ఘటనపై అత్యున్నత స్ధాయి‌ కమిటీ విచారణ జరుగుతోందని విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. వేపగుంట, పెందుర్తి రోడ్, ఇండస్ట్రీ మెయిన్ గేట్ వద్ద గాలిలో స్టెరైన్ శాతం జీరోగా ఉందన్నారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని, ప్రతీ మృతుని‌ కుటుంబానికి కోటి రూపాయిలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, గుమ్మునూరు జయరాం, ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ హాజరయ్యారు.

పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రైతులు నిరసన

Tags: CS review on the LG event

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *