అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు కలెక్షన్స్ అదుర్స్!!!

Cuddapah babies in Verma Amma Kingdom

Cuddapah babies in Verma Amma Kingdom

Date:13/12/2019

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలను కల్పిత పాత్రలతో తెరకెక్కించి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాకు మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడం తో అభిమానులు , చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఫస్ట్ డే కలెక్షన్లు కూడా కుమ్మేసాయని చిత్ర యూనిట్ చెపుతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సినిమా వందకి వెయ్యి శాతం బ్లాక్ బస్టర్ హిట్టు అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు. సినిమా మొదటి సగం ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు. మనకు తెలిసిన కథనే చూపించారు. కాకపోతే దానిని కల్పిత పాత్రలతో ఫుల్ ఎంటర్టైన్ గా చూపించి ఆకట్టుకున్నారు. ఇక ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో దయనేని రమా హత్యతో కథ మలుపు తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది..అసలు ఈ హత్య ఎవరు చేసారు అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.  సినిమాను వివాదాస్పదం గా కాకుండా కామెడీ గా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. విడుదలైన అన్ని ఏరియల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం విశేషం.

 

‘ప్రతిరోజు పండగే’ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్ !!!

 

Tags:Cuddapah babies in Verma Amma Kingdom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *