సాగు ఒకరిది…ఆన్లైన్ లో పేరు మరొకరిది
-స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ కు అర్జీను అందజేసిన రైతు.
Date:02/12/2019
తుగ్గలి ముచ్చట్లు:
తుగ్గలి మండల పరిధిలోని కడమకుంట్ల రెవెన్యూ లో గల లంకాయ పల్లె గ్రామంలో ఎరుకల సుంకన్న అనే రైతు భూమి ఆన్లైన్ లో మరొకరి పేరుపై నమోదు అయిందని తాహసిల్దార్ కు స్పందన కార్యక్రమం లో అర్జీని అందజేశారు.వివరాల్లోకి వెళ్ళగా గత 50 సంవత్సరాల కాలం నుండి సర్వే నంబర్ 241/1 లో గల 1.25 విస్తీర్ణం గల భూమి సాగు చేస్తున్నాడు.కానీ పొలానికి సంబంధించి ఆన్లైన్ లో పరిశీలించగా మరొకరి పేరుపై ఆన్లైన్లో చూపిస్తుందని రైతు తహసిల్దార్ కు తెలియజేశాడు.ఈ భూమి ఆన్లైన్ సమస్య పరిష్కారం కొరకు కర్నూలు మరియు పత్తికొండ స్పందన కార్యక్రమం లో అర్జీలు అందజేసిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదని రైతు తెలియజేస్తున్నాడు. రైతుకు సంబంధించిన ఆన్లైన్ సమస్యలను వెంటనే రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని సిపిఐ నాయకుడు సుల్తాన్ తాహసిల్దార్ కు తెలియజేశాడు.ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని రైతు ఎరుకలి సుంకన్న స్పందన కార్యక్రమంలో తాహసిల్దార్ కు తెలియజేసాడు.
న్యాయ విద్యార్థుల జిల్లా కో కన్వీనర్ గా ఉదయ్
Tags: Cultivate one another … The name online is someone else’s