ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలి
మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ ముచ్చట్లు:

ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలి. అంతర్జాతీయ సంస్థలు, వేదికలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఔషధ మొక్కలు లేకుండా ఔషధాలు లేవని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం అయన ఔషధ మరియు సుగంధ మొక్కల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR ) సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ మరియు అరోమటిక్ ప్లాంట్స్ (CIMAP) లో జరిగిన కిసాన్ మేళాలో పాల్గోన్నారు.
మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 800 కోట్ల జనాభాకు అవసరమైన మందుల తయారీకి ప్రధాన ఆధారం ఔషధ మొక్కలే. రసాయనిక పదార్థాల నుండి తయారయ్యే సౌంధర్య ఔషధాలు ఆరోగ్యానికి హానికరం. ఔషధ మొక్కల నుండి వచ్చే మందులు వాడడం ఆరోగ్యానికి మంచిది. దీనితోనే నాణ్యతతో కూడిన జీవితం మానవజాతికి లభిస్తుంది. సహజమైన ఉత్పత్తులకు సమాజంలో ఆదరణ పెరుగుతున్నది. లాభదాయక వ్యవసాయాన్ని రైతు ఎప్పుడూ ఆహ్వానిస్తాడని అన్నారు.
పంట పండిన తర్వాత జరిగే వ్యాపారం, ఆ వ్యాపారం పేరిట జరిగే దోపిడీ, అక్కడ రైతుపడే చిక్కులు, అవమానం మూలంగా రైతు ముందుకు సాగలేకపోతున్నాడు.
ఏదైనా ప్రత్యేక పంట, పదార్థం అధికంగా ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు దానిని సాగు చేస్తే ఖచ్చితంగా తిరిగి తీసుకుంటామని చెబితేనే రైతు ఉత్సాహంగా కష్టపడతాడు. దానిని పక్కన పెట్టి ఎంత చేసినా ఫలితం ఉండదని అన్నారు.
సాగు లేకుంటే కేంద్రం ఎక్కడి నుండయినా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. దేశ అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఎంత కావాలి ? ఎంత అవసరం ? అన్న శాస్త్రీయ అంచనాలు, లెక్కలు కేంద్రం వద్ద లేవని అన్నారు.
దేశంలోని ఆయా ప్రాంతాల్లో పండే పంటల సాగును అంచనావేసి దానికి అనుగుణంగా పంటలను ఉత్పత్తి చేయించాలి.మార్కెట్ డిమాండ్, అవసరాలకు అనుగుణంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి, , ఔషధ మరియు సుగంధ మొక్కల ప్రాజెక్ట్ సీనియర్ ప్రిన్స్ పల్ సైంటిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్, తదితరులు పాల్గోన్నారు.
Tags;Cultivation of medicinal plants should be encouraged
