Cultivation practices

Cultivation practices

మెల్బోర్న్ లో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందంతో టీటీడీ చైర్మన్ వైవీ

Date:08/11/2019

తిరుపతి ముచ్చట్లు:

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇక్కడి రైతులు అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడం హర్షణీయమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మెల్బోర్న్ లో సాగుచేస్తున్న క్యాబేజీ, యాపిల్, ద్రాక్ష పంటలను వ్యవసాయ శాస్త్రవేత్త అంగుస్ బృందంతో కలిసి పరిశీలించారు. చీడపీడల నివారణకు అవలంభిస్తున్న సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రత్యేకించి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా అతి తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి నూతన సాగు పద్ధతులు తెలుగు రాష్ట్రాల్లో అవలంభిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారం పైనే రైతులు ఆధారపడి ఉన్నారు. అతి తక్కువ నీటి వినియోగ పద్ధతులతో పంటలు సాగు చేసుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన రైతు భరోసా పథకం గురించి సుబ్బారెడ్డి వ్యవసాయ నిపుణులకు తెలియజేశారు. రాష్ట్ర రైతులు సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్న పంటల గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయులు చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, కిషోర్, నరేందర్ పాల్గొన్నారు.

 

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

 

Tags:Cultivation practices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *