Cultural Heritage at Sri Kalyana Venkateswaraswamy Brahmotsavam

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ

Date:14/02/2020

 

తిరుపతి ముచ్చట్లు:

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఆల‌యంలో నిర్వ‌హిస్తున్న ధార్మిక‌, సంగీత‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల వివ‌రాలిలా ఉన్నాయి.

 

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మండ‌పంలో ఎస్‌.వి.సంగీత కళాశాల ఆధ్వ‌ర్యంలో ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 8.00 గంటల వరకు తిరుప‌తికి చెందిన డా.వి.కృష్ణ‌వేణి బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం నిర్వహించారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు విజ‌య‌న‌గ‌రం చెందిన శ్రీ కె.వి.జాన‌కి ధార్మికోప‌న్యాసం చేశారు.

 

సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు  తిరుప‌తికి చెందిన ఎం.పూర్ణ‌ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం చేయ‌నున్నారు. సాయంత్రం 4.00 నుండి  5.00 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన ఆర్‌.సుశీల బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కాళ‌హ‌స్తికి చెందిన టి.తేజోవ‌తి బృందం సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంట‌ల వ‌ర‌కు ఊంజల్‌ సేవలో తిరుప‌తికి చెందిన కె.విశాల‌క్ష్మి అన్న‌మ‌య్య సంకీర్తన‌ల‌ను ఆల‌పిస్తారు.

దక్షిణకాశిగా విరాజిల్లుతున్న శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయం

Tags: Cultural Heritage at Sri Kalyana Venkateswaraswamy Brahmotsavam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *